ఆంధ్రాబ్యాంకులో చోరీకి విఫలయత్నం | atm thieves attempted to loot atm in hyderabad | Sakshi
Sakshi News home page

ఆంధ్రాబ్యాంకులో చోరీకి విఫలయత్నం

Oct 24 2016 4:50 PM | Updated on Sep 4 2017 6:11 PM

ఆంధ్రాబ్యాంకులో చోరీకి విఫలయత్నం చేసిన సంఘటన సైదాబాద్ పోలీస్‌స్టేషన్‌లో జరిగింది.

సైదాబాద్: ఆంధ్రాబ్యాంకులో చోరీకి విఫలయత్నం చేసిన సంఘటన సైదాబాద్ పోలీస్‌స్టేషన్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఐఎస్‌సదన్ డివిజన్ వినయ్‌నగర్ కాలనీలోని బోజిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఎదురుగా ఉన్న ఆం్రధాబ్యాంకులో ఏటీఎం సెంటర్ ఉంది. ఏటీఎం సెంటర్లో నుంచే బ్యాంకులోకి దారి ఉంది. మధ్యలో గ్రిల్స్‌తో పాటు అద్దాలు ఉన్నాయి. ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి ఏటీఎంలో డబ్బులు డ్రా చేయడానికి వచ్చి పక్కనే ఉన్న బ్యాంకు ద్వారం వద్ద ఉన్న అద్దాలను ధ్వంసం చేశాడు.

గ్రిల్స్‌ను కూడ తీయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో వెనుతిరిగాడు. అయితే అక్కడ ఉన్న సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు కనిపించడం లేదని పోలీసులు చెబుతున్నారు. బ్యాంకులో మొత్తం మూడు సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ దొంగ ఆచూకి కనిపించకపోవడం గమనార్హం. సంఘటన స్థలాన్ని మలక్‌పేట ఏసీపీ సి. హెచ్ సుధాకర్, సైదాబాద్ ఇన్‌స్పెక్టర్ సత్తయ్యలు పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇతర సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement