నోట్ల క్యూ లో వృద్ధుడి మృతి | Sakshi
Sakshi News home page

నోట్ల క్యూ లో వృద్ధుడి మృతి

Published Tue, Nov 15 2016 4:19 PM

man Dies While Waiting In Queue To Exchange Rs 500 and rs.1000

హైదరాబాద్: సికింద్రాబాద్ వెస్ట్ మారేడు పల్లి ఆంధ్రా బ్యాంక్ వద్ద విషాదం చోటు చేసుకుంది. పెద్ద నోట్ల మార్పిడి కోసం వచ్చిన ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన వివరాలివీ.. బ్యాంకులో రూ.500, రూ.1000 నోట్లను డిపాజిట్ చేసేందుకు లక్ష్మీనారాయణ అనే రిటైర్డు ఉద్యోగి వెళ్లారు. ఆయన ఉదయం నుంచి క్యూలో ఉండగా మధ్యాహ్నం ఒక్కసారిగా కుప్పకూలాడు. అక్కడికి వారు వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా కన్నుమూశాడు. ఈ ఘటనపై  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
Advertisement