
హైదరాబాద్ : నగరంలోని ఓల్డ్ సిటీ ఐఎస్ సదన్ డివిజన్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మాదన్నపేటలో ఓ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. మంటలకు తోడుగా దట్టమైన పొగ కమ్ముకుంది. దీంతో పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్న కార్మికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకు అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైరింజిన్లతో మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తుంది.
