మహిళపై యాసిడ్ దాడి | Acid attack on woman | Sakshi
Sakshi News home page

మహిళపై యాసిడ్ దాడి

Nov 18 2016 7:48 PM | Updated on Aug 17 2018 2:18 PM

జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ మహిళపై యాసిడ్ దాడి జరిగింది

హైదరాబాద్: జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ మహిళపై యాసిడ్ దాడి జరిగింది. కుత్బుల్లాపూర్ శివాలయం వద్ద శుక్రవారం సాయంత్రం నడిచి వెళ్తున్న అయోధ్యనగర్‌కు చెందిన రాజేశ్వరి(30)పై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ చల్లాడు. దీంతో ఆమె వీపు భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఆమె కేకలు వేయటంతో దుండగుడు పారిపోయాడు. స్థానికులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ ఘటన జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement