ఆర్టికల్ 371డి రద్దు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పడం బాధాకరంగా ఉందని జస్టిస్ లక్ష్మణరెడ్డి వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: ఆర్టికల్ 371డి రద్దు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పడం బాధాకరంగా ఉందని జస్టిస్ లక్ష్మణరెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన ఇక్కడ విశ్రాంత ఐజీ హనుమంతారెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. జోనల్ వ్యవస్థ రద్దు చేస్తే రాయలసీమలో నిరుద్యోగం పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
'ప్రాజెక్టులన్నీ ఆంధ్ర ప్రాంతానికే పరిమితం అవుతున్నాయి. రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. రాజధాని కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేసే బదులు.. రాయలసీమ అభివృద్ధికి యత్నించాలి. రాయలసీమకు న్యాయం చేయకుంటే ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడాల్సి వస్తుంది' అని రిటైర్డ్ ఐజీ హనుమంతారెడ్డి అన్నారు.