ఆటో ఢీకొని మూడేళ్ల చిన్నారి మృతి | 3 years old girl killed in auto accident | Sakshi
Sakshi News home page

ఆటో ఢీకొని మూడేళ్ల చిన్నారి మృతి

Nov 3 2016 4:24 PM | Updated on Sep 4 2017 7:05 PM

నగరంలోని జీడిమెట్ల పరిధిలోని అపురూప కాలనీలో విషాదం చోటు చేసుకుంది.

హైదరాబాద్‌: నగరంలోని జీడిమెట్ల పరిధిలోని అపురూప కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారిని ఓ ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్రగాయాలపాలైన చిన్నారి తనూశ్రీ అక్కడికక్కడే మృతి చెందింది. తనూశ్రీ తండ్రి పేరు అచ్యుతరావు. సొంతూరు శ్రీకాకుళం జిల్లా. స్థానికంగా కిరాణా షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement