‘సర్దార్ గబ్బర్ సింగ్’ బ్లాక్ టికెట్లు: ముగ్గురు అరెస్ట్ | 3 arrested for selling black tickets for 'Sardaar Gabbar Singh' | Sakshi
Sakshi News home page

‘సర్దార్ గబ్బర్ సింగ్’ బ్లాక్ టికెట్లు: ముగ్గురు అరెస్ట్

Apr 7 2016 5:26 PM | Updated on Sep 3 2017 9:25 PM

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ శుక్రవారం విడుదలకానున్న క్రమంలో బ్లాక్ టికెట్ల విక్రయం జోరందుకుంది.

హైదరాబాద్‌ : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ శుక్రవారం విడుదలకానున్న క్రమంలో బ్లాక్ టికెట్ల విక్రయం జోరందుకుంది. కుషాయిగూడలోని తుళ్లూరి సినిమా టాకీస్‌పై ఎస్‌ఓటీ పోలీసులు గురువారం మధ్యాహ్నం ఆకస్మిక దాడి నిర్వహించారు.‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా టిక్కెట్లను బ్లాక్‌లో అమ్ముతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు రూ.21 వేల నగదు, ఒక బైక్, 650 టికెట్లను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement