షార్ట్ సర్క్యూట్‌తో 8 మంది చిన్నారులకు గాయాలు | 12 injured from electrocution | Sakshi
Sakshi News home page

షార్ట్ సర్క్యూట్‌తో 8 మంది చిన్నారులకు గాయాలు

Apr 9 2016 6:01 PM | Updated on Sep 3 2017 9:33 PM

భవానీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో శనివారం సాయంత్రం విద్యుత్ షార్ట్‌ సర్క్యూట్ సంభవించి12 మంది గాయపడ్డారు.

హైదరాబాద్ : భవానీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో శనివారం సాయంత్రం విద్యుత్ షార్ట్‌ సర్క్యూట్ సంభవించి12 మంది గాయపడ్డారు. వారిలో 8 మంది చిన్నారులు కూడా ఉన్నారు. క్షతగాత్రుల్లో ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. సకాలంలో స్థానికులు స్పందించి, పెను ప్రమాదం జరగకుండా కాపాడగలిగారు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement