రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సతీమణి శుభ్రా ముఖర్జీ మృతికి వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు.
హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సతీమణి శుభ్రా ముఖర్జీ మృతికి వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. అదేవిధంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభ్రా ముఖర్జీ మృతికి సంతాపం ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆమె మృతి పట్ల సంతాపం తెలిపారు.
కాగా గత కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న శుభ్రా ముఖర్జీ వారం రోజులుగా ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.