బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, ప్రధాని నరేంద్రమోదీ మతోన్మాద శక్తులకు అండగా నిలుస్తున్న హిందూ తాలిబన్లని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు
బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, ప్రధాని నరేంద్రమోదీ మతోన్మాద శక్తులకు అండగా నిలుస్తున్న హిందూ తాలిబన్లని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ దేశానికి, రాష్ట్రానికి ఏం చేసిందని సభ నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన చట్టంలోని ఒక్క హామీని కూడా కేంద్రం అమలు చేయలేదని మండిపడ్డారు. శాసన సభలో ఇదే విషయాన్ని రాష్ట్ర గవర్నర్ కూడా చెప్పారని గుర్తు చేశారు. దేశంలో స్వేచ్ఛ కావాలని కోరిన కన్నయ్య కుమార్‌ను చంపితే రూ.11 లక్షలు, నాలుక కోస్తే రూ.5 లక్షలు ఇస్తామని ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ నేతలు ప్రకటించడం మతోన్మాదం తలకెక్కి చేసిన చర్యగా అభివర్ణించారు.