చేతకాకుంటే వెళ్లిపోండి
ఇరిగేషన్ అధికారులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
	ఇరిగేషన్ అధికారులపై తుమ్మల ఫైర్
	భద్రాచలం: ఇరిగేషన్ అధికారులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  మరో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, అధికారుల సమక్షంలోనే ఆయన తీవ్ర పదజాలం ఉపయోగించారు. పుష్కర ఘాట్లలో బురదను తీసి, మెట్లకు రంగులు వేయాలని ఆదేశించినా చేయరా.. అని ఇరిగేషన్ ఈఈ రాములను నిలదీశారు. ‘ఈయన పెద్ద పుడుంగని జిల్లా మొత్తం అప్పగిస్తున్నావ్’ అంటూ ఎస్‌ఈ సుధాకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
	
	‘మీకు ఇష్టం లేకపోతే వెళ్లిపోండి’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చం ద్రబాబు జేజమ్మ వచ్చి నా పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును అడ్డుకోలేరని విలేకరులతో మాట్లాడుతూ అన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
