చిత్తూరు జిల్లాలో వర్షం కురుస్తోంది. తిరుమల, తిరుపతి లో శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది.
హైదరాబాద్: చిత్తూరు జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. తిరుమల, తిరుపతి లో శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. వర్షం కారణంగా వైకుంఠం వెలుపల ఉన్న భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా వరుస సెలవుల కారణంగా భారీగా భక్తుల రద్దీ పెరుగుతోంది. స్వామి వారి దర్శనం కోసం 31 కంపార్ట్ మెంట్లలో నిండి వెలుపలి వరకు భక్తులు క్యూలో వేచి ఉన్నారు.
సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 11 గంటల సమయం పడుతోంది.