రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కే ఓటు వేయాలని టీటీవీ దినకరన్ వర్గం నిర్ణయించింది.
చెన్నై: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కే ఓటు వేయాలని అన్నాడీఎంకే (అమ్మ) ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ వర్గం నిర్ణయించింది. అన్నా డీఎంకేలో రెండు చీలిక వర్గాలైన సీఎం ఎడపాడి, మాజీ సీఎం పన్నీర్‌సెల్వం వర్గాలు రామ్‌నాథ్ కోవింద్‌కే తమ మద్దతను ఇప్పటికే ప్రకటించాయి. వారిద్దరితో విభేదించే దినకరన్ ఆలోచనలో పడ్డారు. అంతేగాక ఓటు కోసం బీజేపీ నుంచి తనను ఎవరైనా కలుస్తారేమోనని ఎదురుచూసి నిరాశ చెంది చివరకు తన నిర్ణయాన్ని శుక్రవారం ప్రకటించారు. కాగా, కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి వల్లనే అన్నాడీఎంకేలోని అన్ని వర్గాలు ఎన్‌డీఏ అభ్యర్థివైపు నిలిచాయని తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ వ్యాఖ్యానించారు.