రంగురాళ్ల ముఠాలో టీడీపీ నాయకులు! | colour stones gang arrested in vijayanagaram | Sakshi
Sakshi News home page

రంగురాళ్ల ముఠాలో టీడీపీ నాయకులు!

Jul 30 2015 2:05 PM | Updated on Aug 20 2018 4:27 PM

రంగురాళ్ల ముఠాలో టీడీపీ నాయకులు! - Sakshi

రంగురాళ్ల ముఠాలో టీడీపీ నాయకులు!

రంగురాళ్లను కొనుగోలు చేస్తున్న 11 మంది సభ్యుల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

విజయనగరం: రంగురాళ్లను కొనుగోలు చేస్తున్న 11 మంది సభ్యుల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన విజయనగరం జిల్లా సాలూరులో గురువారం జరిగింది. పట్టుబడిన నిందితుల వద్ద నుంచి పోలీసులు రూ. 20 వేల నగదుతో పాటు నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

కాగా, ముఠాకు చెందిన మరో ముగ్గురు వ్యక్తులు పరారిలో ఉన్నారు. పరారిలో ఉన్నవారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నారు. పట్టుబడ్డ వారిలో నర్సిపట్నంకు చెందిన టీడీపీ నాయకులు ఉన్నట్లు సమాచారం. రంగురాళ్లను విక్రయించిన, కొనుగోలు చేసిన కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement