ఏపీలో కాల్ మనీ వ్యాపారుల ఆగడాలు శృతి మించుతున్నాయి.
రెచ్చిపోయిన కాల్ మనీ వ్యాపారులు
Feb 12 2016 1:37 PM | Updated on Oct 19 2018 8:11 PM
కర్నూలు: ఏపీలో కాల్ మనీ వ్యాపారుల ఆగడాలు శృతి మించుతున్నాయి. అప్పుతీసుకున్న వారి ప్రాణాలు తీస్తున్నాయి. మరికొందరిపై వడ్డీ వ్యాపారులు దాడులకు దిగుతున్నారు. తాజాగా కర్నూలు జిల్లా నంద్యాలలో శుక్రవారం కాల్ మనీ వ్యాపారులు రెచ్చిపోయారు. నంద్యాల పట్టణం ఎస్‌బీఐ కాలనీకి చెందిన రాజేశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి స్థానిక వడ్డీ వ్యాపారి చందు వద్ద రూ.10 వడ్డీకి రూ.4 లక్షలు రుణంగా తీసుకున్నాడు. అందుకు గాను దఫాలుగా డబ్బు చెల్లిస్తూ వస్తున్నాడు. ఇప్పటి వరకు రెండుసార్లు రూ. లక్ష ఇచ్చాడు.
మిగతా డబ్బును శుక్రవారం కల్లా చెల్లించాలంటూ తీవ్రంగా ఒత్తిడి తేవటంతో రాజేశ్వర్‌రెడ్డి నిస్సహాయత వ్యక్తం చేశాడు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చందూ అతడిని పిడిగుద్దులు గుద్దాడు. దీంతో కుడి భుజం కిందికి జారిపోయింది. కుటుంబసభ్యులు రాజేశ్వరరెడ్డిని నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని టూటౌన్ పోలీసులు తెలిపారు.
Advertisement
Advertisement