సింగపూర్ లో బతుకమ్మ వేడుకలు


సింగపూర్ లో బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగాయి. తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ ఆధ్వర్యంలో సంబవాంగ్ పార్క్ లో బంగారు బతుకమ్మవేడుకలు నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టేలా నిర్వహించిన ఈ ఉత్సవాలకు వందల మంది తెలుగు వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరిచాయి.
బతుకమ్మ పాటలు, కోలాటం, నృత్యాలతో వేదిక హోరెత్తింది. ఉత్తమ బతుకమ్మలకు, బతుకమ్మ సందర్భంగా ఏటా నిర్వహించే క్రికెట్ టోర్నీ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. బతుకమ్మ వేడుకలు ఎన్నారైల్లో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయని సొసైటీ అద్యక్షుడు బండ మాధవ రెడ్డి తెలిపారు.

 
 

Read also in:
Back to Top