మందుపాతర పేలుడు: 12 మందికి గాయాలు | 12 police injured in landmine blast at chhattisgarh | Sakshi
Sakshi News home page

మందుపాతర పేలుడు: 12 మందికి గాయాలు

Mar 11 2016 1:38 PM | Updated on Oct 9 2018 2:51 PM

మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. పోలీసులే లక్ష్యంగా మందు పాతర పేల్చారు.

భద్రాచలం: మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. పోలీసులే లక్ష్యంగా మందు పాతర పేల్చారు. ఈ ఘటనలో 12 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాలో కుంట పోలీస్ స్టేషన్ సమీపంలో శుక్రవారం ఉదయం మావోయిస్టులు ఈ  ఘటనకు పాల్పడ్డారు. అటవీ ప్రాంతంలో కూంబింగ్ జరుపుతున్న పోలీసులే లక్ష్యంగా చేసుకుని ల్యాండ్ మైన్ పెట్టి పేలుడు కు పాల్పడ్డారు.

రెండు వారాల క్రితం జరిగిన మావోయిస్టుల ఎన్ కౌంటర్ కు ప్రతీకారంగానే ఈ చర్యకు పాల్పడినట్టు సమాచారం. ఎటువంటి ప్రాణనష్టం జరగక పోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.  ఘటనలో గాయపడిన 12 మంది పోలీసులకు  చికిత్స అందిస్తున్నారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో సమీపంలోని ఖమ్మం జిల్లా భద్రాచలం ఆస్పత్రికి తరలించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement