విశాఖపట్నం జిల్లా హుకుంపేట మండలం గుడుగుపల్లి వద్ద ఎక్సైజ్ అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు.
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా హుకుంపేట మండలం గుడుగుపల్లి వద్ద ఎక్సైజ్ అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా తరలిస్తున్న 100 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించి... వారిపై కేసు నమోదు చేశారు.