123వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌ | Sakshi
Sakshi News home page

123వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

Published Wed, Mar 28 2018 6:36 PM

YS Jagan Mohan Reddy PrajaSankalpaYatra Schedule Day 123 - Sakshi

సాక్షి, గుంటూరు : వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 123వ రోజు షెడ్యూల్‌ ఖరారు అయింది. గురువారం ఉదయం ఆయన గుడిపూడి శివారు నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడ నుంచి పెదమక్కెన, పెదకూరపాడు వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది.

ముగిసిన 122వ రోజు పాదయాత్ర
వైఎస్‌ జగన్‌ 122వ రోజు పాదయాత్ర సత్తెనపల్లి నియోజకవర్గం గుడిపూడి వద్ద ముగిసింది. ఇవాళ 11కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగింది. రామకృష్ణాపురం, నందిగామ్‌, గుడిపూడి కాలనీ మీదగా ...గుడిపూడి వరకూ ప్రజాసంకల్పయాత్ర సాగింది. ఇప్పటివరకూ వైఎస్‌ జగన్‌ 1623.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement