గొట్టిపాడులో తీవ్ర ఉద్రిక్తత | Tension prevailed in Guntur district gottipadu | Sakshi
Sakshi News home page

గొట్టిపాడులో తీవ్ర ఉద్రిక్తత

Jan 1 2018 4:02 PM | Updated on Oct 17 2018 4:29 PM

Tension prevailed in Guntur district gottipadu - Sakshi

గుంటూరు : గుంటూరు జిల్లాలో పత్తిపాడు మండలం గొట్టిపాడులో రెండు సామాజిక వర్గాల మధ్య ఏర్పడిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. గత రాత్రి నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా  గ్రామంలోని రెండు వర్గాల మధ్య  ఈ వివాదం మొదలైంది. అది కాస్తా ఘర్షణకు దారి తీయడంతో ఇరువర్గాలు రాళ్లు రువ్వుకుని, కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామంలో యుద్ధ వాతావరణం నెలకొనడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. ఓ వైపు ఇరువర్గాల దాడులు, మరోవైపు పోలీసులు భారీగా మోహరించడంతో  ఎప్పుడేమి జరుగుతుందో అన్న భయంతో గ్రామస్తులు హడలిపోతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement