మాలిన్యం తొలగించే దీపాలు

25 Years Completed To World Book Fair - Sakshi

పుస్తకపఠనం, పుస్తకప్రచురణ, కాపీరై ట్‌లను ప్రోత్సహించే లక్ష్యంగా ప్రపంచ ప్రసిద్ధ స్పానిష్‌ రచయిత మైఖెల్‌ సెర్వాంటిస్‌ వర్ధంతిని (ఏప్రిల్‌ 23) దృష్టిలో ఉంచుకొని 1995 నుండి యునెస్కో ప్రపంచ పుస్తకదినోత్సవాన్ని  జరిపేందుకు నిర్ణయించింది. ప్రపంచ ప్రసిద్ధ స్పానిష్‌ రచయిత  మైఖెల్‌ కెర్విం టిస్‌ పేద కుటుంబంలో జన్మించాడు. తొలిరోజుల్లో స్పానిష్‌ రాణి ఎలిజిబెత్‌ వెలోయిస్‌ స్మృతి కవితల సంకలనాన్ని 1569లో ప్రచురించాడు. ఆర్థిక సమ స్యల వల్ల ఇటలీలో స్పానిస్‌ మిలటరి దళంలో సైనికుడిగా చేరాడు. «ధైర్య సాహసాలతో లెపాంటో యుద్ధంలో (1571) పాల్గొని తీవ్రంగా గాయప డ్డాడు.

తిరిగి వచ్చిన తరువాత ‘లాగ లాటి’ అనే నవలను గ్రామీణ శృంగార జీవితం ఇతివృత్తంగా రాశాడు. తర్వాత సాహసవీరుల గాథలు ఇతివృత్తంగా ‘డాన్‌క్విక్సోటి’ నవల మొదటి భాగాన్ని 1605లో ప్రచురించాడు. రెండోభాగాన్ని 1615లో ప్రచురించాడు. ఆ నవలను ప్రపంచవ్యాప్తంగా 60 భాషల్లోకి అను వదించారు. ప్రపంచంలో అత్యధిక ప్రతులు అమ్ముడుపోయిన నవలగా ప్రసిద్ధి పొందింది. అప్పట్లో రచయితకు కాపీరైట్‌ హక్కు, రాయల్టీ సదుపాయం లేనందున ఆర్థికంగా సంపన్నుడు కాలేక పోయాడు. ఈ విషయాలన్ని  దృష్టిలో ఉంచుకొని యునెస్కో ప్రచురణ, కాపీ రైట్‌లను ప్రోత్సహించేందుకు ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని ప్రకటించింది.

‘పుస్తకాలు మనో మాలిన్యాన్ని తొలగించే దీపాలు’ అని భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ పేర్కొన్నారు. ప్రముఖ సంఘ సంస్కర,్త కందుకూరి వీరేశలింగం ‘చినిగిన చొక్కా అయినా తొడుక్కో... మంచి పుస్తకం కొనుక్కో’ అన్న సూక్తిని ప్రచారం చేశారు. కానీ నేటి యువత పుస్తక పఠ నానికి దూరమైంది. రకరకాల చానళ్ల, మీడియా ప్రభావమే దీనికి కారణం. పుస్త్తకపఠనాసక్తితో విలువైన గ్రం«ధపఠ నంలో నిమగ్నమైన వారిని ఒకప్పుడు పుస్తకాల పురుగులు అనేవారు. నేడు పుస్తకాలు తొలిచే పురుగులే కాని, పుస్తక ప్రియులు లేరు. ప్రతిభావంతమైన రచ యితల మంచి పుస్తకాలను తెలుగు విశ్వవిద్యాలయం, సాహిత్య అకాడమి వంటి సంస్థలు ప్రచురించాలి. గ్రంథా లయాలకు పంపిణి చేసి పాఠకులకు అందుబాటులో  ఉంచాలి. అప్పుడే ప్రపంచ పుస్తక దినోత్సవ పరమార్థం నెరవేరుతుంది. ( ప్రపంచ పుస్తక దినోత్సవానికి నేటితో పాతికేళ్లు)

డాక్టర్‌ పీవీ సుబ్బారావు,
విశ్రాంత ఆచార్యులు
మొబైల్‌: 98491 77594

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top