బిగ్‌బాస్‌-3లో నేను లేను.. క్లారిటీ ఇచ్చిన నటి | I Am Not Participating in Bigg Boss Telugu Show : Shobhitha | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌-3లో నేను లేను.. క్లారిటీ ఇచ్చిన నటి

Jun 25 2019 4:12 PM | Updated on Jul 18 2019 1:53 PM

 I Am Not Participating in Bigg Boss Telugu Show : Shobhitha - Sakshi

హైదరాబాద్‌ : ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్‌ తెలుగు షో త్వరలోనే మూడవ సీజన్‌కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్‌లో ఫలానా వారు పార్టిసిపెంట్‌ చేస్తున్నారంటూ  రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. తాజాగా యువ కథానాయిక శోభిత ధూళిపాళ్ల బిగ్‌బాస్‌ మూడో సీజన్‌లో ఒక పార్టిసిపెంట్‌గా వస్తున్నట్లు సోషల్‌మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ విషయంపై శోభిత ధూళిపాళ్ల  'బిగ్‌బాస్ లో  నేను పాల్గొంటున్నానన్నది రూమరే.  మీ పట్లిసిటీ కోసం నా పేరును వాడుకోవద్దని' ట్విటర్‌లో ఘాటుగానే స్పందించారు.

శోభిత ధూళిపాళ్ల ఇటీవలే అడవి శేష్‌ హీరోగా రూపొందిన గూఢచారి సినిమాలో కథానాయికగా నటించి, మంచి పేరు సంపాదించుకుంది. అధికారికంగా వెల్లడికాకపోయిన తెలుగు బిగ్‌బాస్‌-3 షోలో గుత్తాజ్వాల, సింగర్‌ హేమచంద్ర అడుగుపెడతారని వచ్చిన రూమర్లపై వారే స్వయంగా తాము పాల్గొనడం లేదని చెప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పటికే బిగ్‌బాస్‌-3 తెలుగు షోకు సినీ హీరో అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement