వారఫలాలు

varaphalalu inthis week - Sakshi

8 ఏప్రిల్‌ నుంచి 14 ఏప్రిల్‌ 2018 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఆర్థిక వ్యవహారాలలో కొంత పురోగతి సాధిస్తారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. కోర్టు కేసుల నుంచి విముక్తి లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. వాహనయోగం. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవర్గాలకు నూతన పదవులు దక్కుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, లేత ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
కొన్ని వ్యవహారాలలో ఇబ్బందులు ఎదురైనా పట్టుదలతో అధిగమిస్తారు. రాబడి తగినంతగా ఉంటుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.  పలుకుబడి పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆస్తి వివాదాలు కాస్త ఉపశమనం కలిగిస్తాయి. వ్యాపారాలు కొంతవరకూ పుంజుకుంటాయి. ఉద్యోగులకు అనూహ్యమైన మార్పులు ఉండవచ్చు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం మధ్యలో కుటుంబంలో కలహాలు. ఒత్తిడులు. అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
పనులు అనుకున్న విధంగా పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. విద్యార్థులకు మరింత ఉత్సాహం. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. చాకచక్యంగా వివాదాల నుంచి బయటపడతారు. రియల్‌ఎస్టేట్‌ల వారికి ఊహించని అభివృద్ధి కనిపిస్తుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు రాగలవు. కళారంగం వారికి సన్మాన, సత్కారాలు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆలోచనలు కలసి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. కుటుంబంలో శుభకార్యాలు. రియల్‌ఎస్టేట్‌ల వారికి ప్రోత్సాహకరం. నిరుద్యోగులు లక్ష్యాలు సాధిస్తారు. బంధువుల సహాయం అందుకుంటారు. గృహ నిర్మాణయత్నాలు సానుకూలం. వ్యాపారాలు విస్తరిస్తారు, కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. రాజకీయవర్గాలకు పదవులు దక్కుతాయి. వారం చివరిలో ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. పసుపు, లేత గులాబి రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవిని పూజించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణాలు తీరుస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కుటుంబానికి సంబంధించి ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. కాంట్రాక్టర్లకు విశేషంగా కలసి వస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. వస్తులాభాలు. నిరుద్యోగుల యత్నాలలో పురోగతి. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. మిత్రులతో వివాదాలు. ఎరుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ చాలీసా పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
పనులు కొంత నెమ్మదిగా పూర్తి కాగలవు. ఆర్థిక వ్యవహారాలు సామాన్యంగా ఉన్నా అవసరాలు తీరతాయి. సోదరులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. పొరపాట్లు సరిదిద్దుకుని కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుతాయి. ఉద్యోగులకు అనుకూల సమాచారం. కళారంగం వారు అనుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. వారం మధ్యలో స్వల్ప అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
కొత్త పనులు చేపడతారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. ప్రముఖ వ్యక్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుకుని విస్తరిస్తారు. ఉద్యోగుల సమర్థత వెలుగులోకి వస్తుంది. రాజకీయవర్గాలకు పదవులు, సన్మానాలు. వారం మధ్యలో ధనవ్యయం. ఇంటాబయటా ఒత్తిడులు. నీలం, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. అనుకున్న పనులలో జాప్యం. ఎంతగా శ్రమపడ్డా ఫలితం కనిపించదు. నిర్ణయాలలో తొందరపాటు వద్దు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. ఒక సమాచారం నిరాశ పరుస్తుంది. కుటుంబంలో ఒత్తిడులు. విద్యార్థులకు నిరుత్సాహవంతంగా ఉంటుంది. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. రాజకీయవర్గాలకు సమస్యలు ఎదురుకావచ్చు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ఎరుపు, గులాబి రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
వ్యూహాత్మక వైఖరితో శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త మిత్రులు పరిచయం కాగలరు. ఆస్తి వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. గృహ నిర్మాణాల్లో కొంత ప్రగతి కనిపిస్తుంది. ఆలయాలు, పర్యాటక ప్రాంతాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు సమస్యలు తొలగుతాయి. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు అనుకూల వాతావరణం. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. తెలుపు, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
కొత్త కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ప్రత్యర్థుల నుంచి కూడా మాటసహకారం అందుతుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. కుటుంబసమస్యల నుంచి కొంత గట్టెక్కుతారు. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఊహించని హోదాలు రాగలవు. కళాకారులు అవకాశాలు దక్కించుకుంటారు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. నలుపు, లేత నీలం రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
వ్యూహాత్మకంగా వ్యవహరించి సమస్యల నుంచి బయటపడతారు. ఇంట్లో శుభకార్యాల నిర్వహణతో బిజీగా గడుపుతారు. సంతోషకరమైన సమాచారం అందుతుంది. సోదరులు, మిత్రులతో తగాదాలు పరిష్కారం. విద్యావకాశాలు దక్కుతాయి. ప్రముఖ వ్యక్తులు పరిచయం కాగలరు. భూయోగం. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార లావాదేవీలు అనుకూలిస్తాయి. ఉద్యోగాల్లో ప్రగతి కనిపిస్తుంది. కొందరికి పదోన్నతులు దక్కే అవకాశం. రాజకీయవర్గాలకు కొత్త పదవులు లభిస్తాయి. వారం చివరిలో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. నేరేడు, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఊహించని విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. నూతన పరిచయాలు. సమస్యలు సృష్టించిన వారిని కూడా ఆదరిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. ఆహ్వానాలు అందుకుంటారు. వేడుకలకు హాజరవుతారు. ఇంటాబయటా ఎదురులేని పరిస్థితి. చిరకాల మిత్రులు తారసపడతారు. వ్యాపారాలలో అనూహ్యంగా పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు చిక్కులు తొలగుతాయి. కళారంగం వారి కళానైపుణ్యం వెలుగులోకి వస్తుంది. వారం మధ్యలో అనుకోని ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. గులాబి, లేత ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.
సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు

టారో (8 ఏప్రిల్‌ నుంచి  14 ఏప్రిల్, 2018 వరకు)

మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
ఒక కొత్త జీవితం వైపుకు అడుగులు వేస్తారు. గతాన్ని గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిదని నమ్మండి. మీ ఆలోచనా విధానం పూర్తిగా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక గొప్ప అవకాశానికి పునాది కూడా ఇక్కడే పడుతుంది. ఆర్థిక పరిస్థితి ఊహించని స్థాయిలో మెరుగుపడుతుంది. ఆత్మవిశ్వాసంతో, ఏ పని చేసినా మీదైన ముద్ర కనిపించేలా కష్టపడతారు. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీకిష్టమైన వ్యక్తికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. 
కలిసివచ్చే రంగు : లేత నీలం 

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
ఒక చిన్న ఆలోచన మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఆ ఆలోచన చుట్టూనే ఒక గొప్ప అవకాశానికి దారులు కనిపిస్తాయి. జీవితాశయం వైపు అడుగులు వేస్తారు. అందుకు ఇదే సరైన సమయమని నమ్ముతారు. మీదైన ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసుకునే ఒక వేదిక మీకు దొరుకుతుంది. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీకిష్టమైన వ్యక్తి మీకిచ్చే ఓ బహుమతి మిమ్మల్ని ఉల్లాసంగా ఉంచుతుంది. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. 
కలిసివచ్చే రంగు : గోధుమ 

మిథునం (మే 21 – జూన్‌ 20)
కొన్ని సమస్యలకు మూలాలు మన లోపలే ఉంటాయి. మన ఆలోచనలే ఆ సమస్యలను పుట్టిస్తాయి. మనల్ని మనం అన్వేషించుకుంటూ వెళితే తప్ప అర్థం చేస్కోలేని తత్వం ఇది. మీరు ఆ దిశగా కొన్ని అడుగులు వేయడానికి ప్రయత్నిస్తారు. దీంతో ఇప్పటివరకూ కోల్పోయిన ప్రశాంతత అంతా ఒక్కసారే మీకు ఎదురైనట్టు అనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. కొత్త వ్యక్తిని కలుసుకుంటారు. ఆ వ్యక్తితో పరిచయం కొద్దిరోజుల్లోనే ప్రేమగా మారుతుంది. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు.
కలిసివచ్చే రంగు : లేత ఆకుపచ్చ 

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
మీ ఆలోచనలు రెక్కలు కట్టుకొని ఎగరాలి. అందుకు సరికొత్త మార్గాలను ఎప్పటికప్పుడు మీరే అన్వేషించుకుంటూ వెళ్లాలి. మీకేది కావాలో తెలుసుకొని, ఎందుకు ఏ పని చేస్తున్నారో నిర్ణయించుకొని ముందుకెళ్లండి. ఒక కొత్త వ్యాపార ఆలోచన చేస్తారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి.  ప్రేమ జీవితం ఎప్పట్లానే అద్భుతంగా ఉంటుంది. మిమ్మల్ని ప్రేమించే వారికి అన్నివిధాలా అండగా నిలబడండి. విహారయాత్రకు సన్నాహాలు చేసుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. 
కలిసివచ్చే రంగు : వంకాయ 

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
మీరనుకున్నట్టే అన్నీ జరిగితే అది జీవితం కాదని తెలుసుకోండి. కొన్ని గొప్ప మార్పులకు సంకేతాలను ప్రకృతి మనకు ముందే పంపిస్తుంది. వాటిని అర్థం చేస్కొని ఆ దిశగా మన అడుగులు వెయ్యాలని తెలుసుకోండి. ఎప్పట్నుంచో ఎదురుచూస్తోన్న ఒక అవకాశం మీ తలుపు తడుతుంది. కొన్ని ఒడిదుడుకులు ఉన్నా ప్రేమ జీవితంలో ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకుంటారు. ఆర్థిక çగతంలో కంటే మెరుగుపడుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.
కలిసివచ్చే రంగు : ఎరుపు 

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
కొత్త విషయాలు తెలుసుకున్నప్పుడల్లా మీ ముఖంలో ఒక రకమైన వెలుగు కనిపిస్తుందని తెలుసుకోండి. ఎప్పటికప్పుడు కొత్త విషయాలను తెలుసుకుంటూ వెళ్లడాన్ని అలవాటు చేసుకోండి. ప్రేమ జీవితం మీకొక గొప్ప వరం. ప్రేమించిన వ్యక్తికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ మిమ్మల్ని మీరు ఉత్సాహంగా ఉంచుకుంటారు. ఆత్మవిశ్వాసమే మీ ఆయుధమని నమ్మండి. కొన్ని విషయాల్లో కొందరిని తక్కువ చేసి చూడడం మీకు సరదా. దీన్ని ఇప్పుడే వదిలించుకోండి. 
కలిసివచ్చే రంగు : పసుపు 

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
ఈవారమంతా చాలా సంతోషంగా ఉంటారు. కొత్త ఆలోచనలు మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతాయి. విహారయాత్రకు సన్నాహాలు చేసుకుంటారు. ఇది మిమ్మల్ని మీకు కొత్తగా ఆవిష్కరించి చూపుతుంది. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. జీవితాశయం వైపుకు అడుగులు వేయాలని ఆలోచిస్తారు. అందుకు ఇదే సరైన సమయమని కూడా గ్రహించండి. కొద్దికాలంగా మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్న సమస్యలన్నీ ఇప్పుడిప్పుడే కొలిక్కి వస్తాయి. అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. 
కలిసివచ్చే రంగు : గోధుమ 

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
ఎప్పట్నుంచో మిమ్మల్ని ఎదురుచూపులకే పరిమితం చేసిన ఒక గొప్ప విజయం మీకు దగ్గరగా వచ్చి ఉంది. ఆ విజయాన్ని త్వరలోనే అందుకుంటారు. జీవితమంతా మనం గీసుకున్న ఓ వృత్తం చుట్టూ తిరుగుతుందని తెలుసుకోండి. ఆ వృత్తాన్ని మనకు తగ్గట్టుగా మార్చలేమని, అయినా అందులోనే సంతోషాన్ని వెతుక్కోవడమే వాస్తవమని తెలుసుకోండి. వాస్తవంలో బతికితేనే మీకు కొన్ని విషయాలు స్పష్టంగా కనిపిస్తాయి. అవన్నీ మిమ్మల్ని ఉన్నతంగా నిలబెట్టేవే. శక్తినంతా కూడదీసుకొని పనిచేయండి.
కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ 

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
ఈవారం ఒక గొప్ప శుభవార్త వింటారు. అన్నీ మీరనుకున్నట్టుగానే జరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ వృత్తి జీవితంలో ఏదో వెలతి మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. మీ ఆలోచనా విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే మీకు కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అదృష్టం ఎప్పుడూ మీ వెన్నంటే ఉంటుంది. ప్రేమ జీవి తం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరిష్టపడే వ్యక్తికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. 
కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ 

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
మీ ఆలోచనా విధానం మారాల్సిన సమయం ఇదే. అందరినీ తక్కువ అంచనా వేసే మీ స్వభావం వల్ల చాలామందికి మీరు దూరమవుతున్నారు. ఈ రెండు విషయాల్లో మీలో వచ్చే మార్పే మిమ్మల్ని విజయం వైపుకు అడుగులు వేయిస్తుంది. ఒక గొప్ప అవకాశం ఈ వారాంతం మీ తలుపు తడుతుంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు మిమ్మల్ని మీరు సిద్ధంగా ఉంచుకోండి. ప్రేమ జీవితంలో కొన్ని అనుకోని సవాళ్లు ఎదురైనా వాటన్నింటికీ ఎదురెళ్లి నిలబడతారు.
కలిసివచ్చే రంగు : వెండి 

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
ఈవారమంతా మీరు ఊహించనంత సంతోషంగా ఉంటారు. కొత్త కొత్త అవకాశాలు మీ తలుపు తడతాయి. ఈ అవకాశాల కోసమే ఎప్పట్నుంచో ఎదురుచూస్తోన్న మీకు, రాబోయే రోజులు గొప్ప ఆనందాన్నిస్తాయి. అయితే అవకాశాలను అందిపుచ్చుకోవడంతోనే అయిపోయిందనుకుంటే మీ పని అయిపోయినట్టే. కష్టపడి, ఆత్మస్థైర్యంతో విజయం వరకూ సడలని ధైర్యంతో పనిచేయండి. ఆర్థిక పరిస్థితి ఎప్పట్లానే సాధారణంగా ఉంటుంది.  ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. 
కలిసివచ్చే రంగు : పీచ్‌ 

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
గొప్పవాళ్లందరూ ఎన్నో అడ్డంకులను దాటొచ్చాకే గొప్పవాళ్లు అయ్యారు. ఈ విషయం తెలుసుకుంటే మిమ్మల్ని వెంటాడే భయాలు అసలు భయాలా కాదా అర్థమవుతుంది. ధైర్యంగా నిలబడి, పరిస్థితులకు ఎదురెళ్లి పోరాడండి. అవకాశాలు రావట్లేదని కూర్చోకుండా అందుకు మీరేం చెయ్యాలో ఆలోచించండి. విహారయాత్రకు సన్నాహాలు చేసుకుంటారు. ప్రేమ జీవితానికి సంబంధించి ఒక కీలక నిర్ణయాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అన్నివిధాలా ఆలోచించి ఆ నిర్ణయం తీసుకోండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. 
కలిసివచ్చే రంగు : గులాబి 
- ఇన్సియా టారో అనలిస్ట్‌ 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top