చర్చిల్ కళాపోషణ... | Churchill art nutrition ... | Sakshi
Sakshi News home page

చర్చిల్ కళాపోషణ...

Apr 26 2015 1:01 AM | Updated on Sep 17 2018 5:10 PM

చర్చిల్ కళాపోషణ... - Sakshi

చర్చిల్ కళాపోషణ...

బ్రిటిష్ మాజీ ప్రధాని సర్ విన్‌స్టన్ చర్చిల్ దొరవారు రాజకీయ దురంధరుడిగానే ప్రపంచానికి తెలుసు...

బ్రిటిష్ మాజీ ప్రధాని సర్ విన్‌స్టన్ చర్చిల్ దొరవారు రాజకీయ దురంధరుడిగానే ప్రపంచానికి తెలుసు. ఆయన వాక్చాతుర్యం, మదిరాభిమానం కూడా జగద్విఖ్యాతి పొందాయి. రాజకీయ సమావేశాలు, కాక్‌టెయిల్ పార్టీలతో ఆయన దినచర్య దాదాపు తీరిక లేకుండా ఉండేది. అయితే చర్చిల్‌లో మరో కోణం కూడా ఉంది. అరుదుగా దొరికే తీరిక వేళల్లో చర్చిల్ కుంచె పట్టేవారు. రంగుల ప్రపంచంలో సేదదీరుతూ అబ్బురపరచే చిత్తరువులను తీర్చిదిద్దేవారు.

రాజకీయాల్లోకి రాకుండా చిత్రకళకే అంకితమై ఉంటే, బాగానే సంపాదించి ఉండేవారని ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు పికాసో కూడా ప్రశంసించారు. అంటే, చర్చిల్ చిత్రకళలో ప్రతిభావంతుడేనన్నమాట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement