breaking news
Cocktail Party
-
రెడ్ బెనారసీ డ్రెస్‌లో పార్టీ లుక్.. తొలిసారి ఇలా అన్షులా!
నెట్టింట ఎక్కడ చూసినా కపూర్ ఫ్యామిలీ కొత్త పెళ్లికూతురు అన్షులా కపూర్ గురించి విశేషాలే. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, నటుడు అర్జున్ కపూర్ సోదరి అన్షులా తన ప్రియుడు రోహన్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. వివాహ వేడుక ముగిసిన తరువాత జరిగిన కాక్టైల్ పార్టీకి తగ్గట్టుగా అందంగా అలంకరించుకుంది. బనారసీ బ్రోకేడ్ డ్రెస్, మెడలో పచ్చల నెక్లెస్‌తో సమకాలీన ఫ్యాషన్ స్టైల్‌ను చాటుకుంది. ఈ సందర్భంగా ఇన్‌స్టాలో పెట్టిన పోస్ట్ అభిమానులకు విపరీతంగా ఆకర్షిస్తోంది.అన్షులా ఇలా రాశారు : పెళ్లైన మహిళగా ఇది నా తొలి సాయంత్రం, ఈ కొత్త ప్రయాణాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నా. ఈ లుక్కు సిందూరి ఎరుపు రంగు మాత్రమే సరిగ్గా సరిపోతుంది అనిపించింది. ఈ ఔట్ఫిట్ గురంచి అమిత్ (ప్రముఖ డిజైనర్)తో మాట్లాడు తున్నపుడు. తన ఆహార్యం వ్యక్తిత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలవాలని అనిపించింది. దానికి తగ్గట్టుగానే శిల్పం లాంటి 'కార్సెట్ సిల్హౌట్' (sculptural corseted silhouette) గా మార్చేశారు. చీర కొంగును సరికొత్త మోడ్రన్ కోట్యూర్ స్టేట్మెంట్గా రీ-డిజైన్ చేశారు. ఇది మన సంప్రదాయానికి గౌరవాన్ని ఇస్తూనే, ఆధునికతను అద్భుతంగా చాటిచెప్పింది. నా దృష్టిలో మా పెళ్లి అంతా కూడా ఇలాగే సాగింది. మనం ఎక్కడి నుండి వచ్చామో ఆ మూలాలను (సంప్రదాయాలను) గుండెల్లో భద్రంగా దాచుకుంటూనే... భవిష్యత్తులోకి అంతే ఆనందంగా, మనస్ఫూర్తిగా అడుగుపెట్టడం! అంటూ చెప్పుకొచ్చారు. View this post on Instagram A post shared by Anshula Kapoor (@anshulakapoor)> ఇదీ చదవండి: అన్షులా-రోహన్ ఇంట్రస్టింగ్ లవ్ స్టోరీ, భర్త ఆస్తి ఎంతంటే! కాగా ముంబైలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్‌లో సోమవారం (జూలై 6న) అన్షుల్ - రోహన్ వివాహ వేడుక అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా దివంగత తల్లిని గుర్తు చేసుకుంటూ 42 ఏళ్ల నాటి ఆమె దుప్పట్టాను ధరించడం విశేషంగా నిలిచింది. ఇదీ చదవండి: 42 ఏళ్ల నాటి అమ్మ దుప్పట్టా : కొత్త పెళ్లికూతురు అన్షులా ఎమోషనల్ -
చర్చిల్ కళాపోషణ...
బ్రిటిష్ మాజీ ప్రధాని సర్ విన్స్టన్ చర్చిల్ దొరవారు రాజకీయ దురంధరుడిగానే ప్రపంచానికి తెలుసు. ఆయన వాక్చాతుర్యం, మదిరాభిమానం కూడా జగద్విఖ్యాతి పొందాయి. రాజకీయ సమావేశాలు, కాక్టెయిల్ పార్టీలతో ఆయన దినచర్య దాదాపు తీరిక లేకుండా ఉండేది. అయితే చర్చిల్లో మరో కోణం కూడా ఉంది. అరుదుగా దొరికే తీరిక వేళల్లో చర్చిల్ కుంచె పట్టేవారు. రంగుల ప్రపంచంలో సేదదీరుతూ అబ్బురపరచే చిత్తరువులను తీర్చిదిద్దేవారు. రాజకీయాల్లోకి రాకుండా చిత్రకళకే అంకితమై ఉంటే, బాగానే సంపాదించి ఉండేవారని ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు పికాసో కూడా ప్రశంసించారు. అంటే, చర్చిల్ చిత్రకళలో ప్రతిభావంతుడేనన్నమాట.


