చోరాఫలి | Choraphali | Sakshi
Sakshi News home page

చోరాఫలి

May 1 2016 1:29 AM | Updated on Sep 3 2017 11:07 PM

చోరాఫలి

చోరాఫలి

మినప్పపు్పును మిక్సీలో వేసి పిండిలా చేసుకోవాలి. గిన్నెలో కొన్ని నీళ్లు పోసి స్టౌ పై పెట్టాలి.

కావలసినవి: శనగపిండి - 1 కప్పు, మినప్పప్పు - 1/3 కప్పు, బేకింగ్‌సోడా - చిటికెడు, నీళ్లు - పావు కప్పు, కారం పొడి - 2 చెంచాలు, నూనె - తగినంత, చాట్ మసాలా - 1 చెంచా, ఉప్పు - చిటికెడు
 
తయారీ: మినప్పపు్పును మిక్సీలో వేసి పిండిలా చేసుకోవాలి. గిన్నెలో కొన్ని నీళ్లు పోసి స్టౌ పై పెట్టాలి. వేడెక్కాక ఉప్పు, ఒక చెంచా నూనె వేయాలి. గోరువెచ్చగా అయ్యాక దించి పక్కన పెట్టాలి. ఓ గిన్నెలో శనగపిండి, మినప్పప్పు పొడి, సోడా తీసుకుని, గోరు వెచ్చని నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలపాలి. తర్వాత ఆ పిండితో చిన్న చిన్న చపాతీలు చేసి, వాటిని ఫొటోలో చూపినట్టు కట్ చేయాలి. ఆపైన వీటిని డీప్ ఫ్రై చేసుకో వాలి. చివరగా వాటిమీద ఉప్పు, కారం, చాట్ మసాలా చల్లాలి. ఇది గుజరాతీ స్నాక్. దీపావళికి అయితే తప్పక చేసుకుంటారు.

Advertisement
 
Advertisement
Advertisement