పొంగనివ్వవు... పొర్లనివ్వవు..! | Boil Over safeguard | Sakshi
Sakshi News home page

పొంగనివ్వవు... పొర్లనివ్వవు..!

Jun 12 2016 1:14 AM | Updated on Apr 3 2019 5:53 PM

పొంగనివ్వవు... పొర్లనివ్వవు..! - Sakshi

పొంగనివ్వవు... పొర్లనివ్వవు..!

బేబీ పాలు పొంగుతున్నాయ్ చూడు... అంటూ పెరట్లోంచి అమ్మ కేకలు వినిపిస్తాయి... ఓ ఇల్లాలు తాను తరుగుతున్న కూరగాయలను మధ్యలోనే...

బేబీ పాలు పొంగుతున్నాయ్ చూడు... అంటూ పెరట్లోంచి అమ్మ కేకలు వినిపిస్తాయి... ఓ ఇల్లాలు తాను తరుగుతున్న కూరగాయలను మధ్యలోనే వదిలేసి స్టవ్ దగ్గరకు పరుగెడుతుంది సాంబార్ పొంగి ఎక్కడ స్టౌ పాడవుతుందోనని! ఇలాంటివి ప్రతి ఇంట్లో తరచూ జరుగుతూనే ఉంటాయి. కాదంటారా? ఇలాంటి సమస్యలకు ఓ కంపెనీ వారు పరిష్కారం కనుగొన్నారు..! అందుకే ఈ ‘బాయిల్ ఓవర్ సేఫ్‌గార్డ్’ను తయారు చేశారు. ఫొటోలో కనిపిస్తున్నదదే. ఈ సేఫ్‌గార్డ్‌ను పూర్తిగా సిలికాన్‌తో రూపొందించారు.

దాంతో ఇది 400 డిగ్రీల ఉష్ణోగ్రతను కూడా తట్టుకోగలుగుతుంది. పాలు, నీళ్లు, సాంబార్ లాంటి ద్రవ పదార్థాలు పొంగకుండా, స్టౌ పాడవకుండా చేస్తుందీ సేఫ్‌గార్డ్. ఇకపై స్టౌను పొంగిన ప్రతిసారీ శుభ్రం చేయాల్సిన పని లేదు. దీన్ని మిగతా సమయాల్లో  గిన్నెలు, డబ్బాల మీదకు మూతలాగా  ఉపయోగించుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement