ఆ సీన్ చూసి... | Amitabh Bachchan with teji bachchan | Sakshi
Sakshi News home page

ఆ సీన్ చూసి...

May 10 2015 1:01 AM | Updated on Sep 3 2017 1:44 AM

ఆ సీన్ చూసి...

ఆ సీన్ చూసి...

బాలీవుడ్ ‘బిగ్ బీ’ అమితాబ్ బచ్చన్‌కు తల్లి తేజీ బచ్చన్‌తో గాఢమైన అనుబంధం ఉంది.

అమ్మ మనసు
బాలీవుడ్ ‘బిగ్ బీ’ అమితాబ్ బచ్చన్‌కు తల్లి తేజీ బచ్చన్‌తో గాఢమైన అనుబంధం ఉంది. అమితాబ్ తండ్రి హరివంశరాయ్ బచ్చన్ కవి. ఆయన మొదటి భార్య చనిపోయిన తర్వాత తేజీ ఆయనను పెళ్లాడారు. సంపన్న కుటుంబానికి చెందిన తన తల్లి అన్నీ వదులుకుని తన తండ్రితో పెళ్లికి సిద్ధపడిందని, తనను తన తమ్ముడు అజితాబ్‌ను అనుక్షణం కంటికి రెప్పలా కాపాడేదని అమితాబ్ తన బ్లాగులో రాసుకున్నారు. సినీరంగంలో ప్రవేశించిన తొలినాళ్లలో విజయాల కోసం పరితపించిన రోజుల్లో తనకు ధైర్యం చెప్పేదని గుర్తు చేసుకున్నారు.

‘దీవార్’ సినిమా చూసిన తర్వాత తన తల్లి వెక్కివెక్కి ఏడ్చిందని గుర్తుచేసుకున్నారు. ఈ సినిమాలో అమితాబ్ పాత్ర మరణించిన దృశ్యం ఆమెను విపరీతంగా కదిలించింది.

Advertisement
 
Advertisement
Advertisement