మిస్టర్‌ కేరళ | Woman Body builder | Sakshi
Sakshi News home page

మిస్టర్‌ కేరళ

Mar 11 2018 12:10 AM | Updated on Mar 11 2018 12:10 AM

Woman Body builder - Sakshi

బాడీ బిల్డింగ్, మజిల్‌ టోనింగ్, వెయిట్‌ ట్రైనింగ్‌... ఇవన్నీ మగవాళ్లకు పరిమితమైన కీర్తి కిరీటాలుగానే ఉండేవి డెబ్భైలలో. వీటన్నిటి మీదా ‘పురుషులకు మాత్రమే’ అనే కనిపించని రాజముద్ర ఒకటి ఉండేది. క్రమంగా ఒక్కో ముద్రా చెరిగిపోతోంది. ఈ కేరళ అమ్మాయి కూడా అలాంటి ఒక ముద్రను చెరిపేసింది. ‘మిస్టర్‌ కేరళ’ పురస్కారాన్ని అందుకుంది!

మజీజియా భానుకి 23 ఏళ్లు. కోళికోడ్‌ జిల్లా, ఓర్కాట్టెరి గ్రామంలో ఉంటుంది వీళ్ల కుటుంబం. డెంటల్‌ కోర్సులో అండర్‌ గ్రాడ్యుయేషన్‌ చేసింది భాను. కుటుంబంలో ఎవరూ బాడీ బిల్డర్లు లేరు. ‘జస్ట్‌ ఆసక్తి కలిగింది, పేరెంట్స్‌ గో ఎహెడ్‌’ అన్నారు. టైటిల్‌ గెలుచుకున్నాను’  అని నవ్వుతూ అంటోంది భాను. కోచ్‌ దగ్గర శిక్షణ ఏమీ తీసుకోకుండానే గత ఏడాది జిల్లా స్థాయి పోటీల్లో గెలిచింది. రాష్ట్రస్థాయి పోటీలకు సిద్ధమయ్యే క్రమంలో కోచ్‌ దగ్గర మెళకువలు నేర్చుకుంది.

అయితే ఆమె  రాష్ట్రస్థాయి చాంపియన్‌ షిప్‌తో ఆగిపోవడం లేదు. ‘‘జాతీయ స్థాయి పోటీలకూ సిద్ధమే’’ అంటోంది. పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలలో కూడా భానుకు అనేక అవార్డులు వచ్చాయి. పోటీల కోసం ఇస్లాం సంప్రదాయాన్ని తానేమీ ధిక్కరించడం లేదని, మత విశ్వాసాలను గౌరవిస్తూ ఒంటి నిండా దుస్తులు ధరిస్తున్నాననీ కూడా చెబుతోంది మజీజియా భాను. అయితే, మహిళా విజేతకు ‘మిస్టర్‌ కేరళ’ అనే టైటిల్‌ ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఉమెన్‌ కేటగిరీ బాడీ బిల్డింగ్‌ పోటీలలో గెలిచిన మహిళకు.. ‘మిస్టర్‌ కేరళ’ అనే టైటిల్‌ని ఇవ్వడం  మహిళలను కించపరచడమేనని స్త్రీవాదులు కొందరు అంటున్నారు.  

‘‘బాడీ బిల్డింగ్‌ పోటీల కోసంనేనేమీ ఇస్లాం సంప్రదాయాలను ధిక్కరించడం లేదు. మత విశ్వాసాలను గౌరవిస్తూ, ఒంటి నిండా దుస్తులు ««ధరించి మాత్రమే బరిలోకి దిగుతున్నాను’’ అంటోంది మజీజియా భాను. 
– మంజీర 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement