ట్రెండ్జ్.. | trendz | Sakshi
Sakshi News home page

ట్రెండ్జ్..

Apr 3 2015 11:21 PM | Updated on Sep 2 2017 11:48 PM

ట్రెండ్జ్..

ట్రెండ్జ్..

పట్టు, ఫ్యాన్సీ, కాటన్ చీరలు... విభిన్నమైన నగనిగలు...

పట్టు, ఫ్యాన్సీ, కాటన్ చీరలు... విభిన్నమైన నగనిగలు... అతివ అందాన్ని రెట్టింపు చేసే ఐటెమ్స్ ఎన్నో కొలువుదీరాయి బంజారాహిల్స్ హోటల్ తాజ్ కృష్ణాలో. పెళ్లిళ్లు, శుభకార్యాలకు కావల్సిన వస్త్రాభరణాలు చూడగానే ఆకట్టుకుంటున్నాయి. వెల్ డిజైన్డ్ వెరైటీల కోసం వేచి చూస్తున్న నగర మగువలకు ఈ ఎగ్జిబిషన్ చివరి మజిలీ అంటూ భరోసా ఇస్తున్నారు నిర్వాహకులు. కోల్‌కతా, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్, మధ్యప్రదేశ్, దిల్లీ, హైదరాబాద్ తదితర నగరాల్లో పేరెన్నికగన్న చీరలు, డిజైనర్ వస్త్రాలు, ఆభరణాలు, బ్రైడల్ వేర్, హాఫ్ శారీస్, లెహంగాలు, లైఫ్‌స్టైల్ ఐటెమ్స్, హోమ్ డెకార్స్, కిడ్స్‌వేర్స్ ఇక్కడి డెబ్భైకి పైగా స్టాల్స్‌లో  ఆకర్షిస్తున్నాయి. శనివారం కూడా ప్రదర్శన ఉంటుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement