
భామాకలాపం...
సాంప్రదాయ కళారూపాలను హైదరాబాదీలకు దగ్గర చేసేందుకు ప్రయత్నిస్తుంది నాట్య సమగ్ర సంస్థ. దీని ఆధ్వర్యంలో విజయనగరానికి చెందిన రెండు వందల ఏళ్లనాటి కళారూపమైన ‘తూర్పుభాగవతం’ సిటీకొచ్చింది.
సాంప్రదాయ కళారూపాలను హైదరాబాదీలకు దగ్గర చేసేందుకు ప్రయత్నిస్తుంది నాట్య సమగ్ర సంస్థ. దీని ఆధ్వర్యంలో విజయనగరానికి చెందిన రెండు వందల ఏళ్లనాటి కళారూపమైన ‘తూర్పుభాగవతం’ సిటీకొచ్చింది. దీనిలో భాగంగా బొంతలకోటి సాంబమూర్తి బృందం ‘భామాకలాపం‘ను బంజారాహిల్స్‌లోని సప్తపర్ణిలో ప్రదర్శించింది. ఈ ప్రదర్శనలో సత్యభామ, చెలికత్తె మాధవి మధ్య సంభాషణ ఆకట్టుకుంది.
కూచిపూడి నృత్యానికి, తూర్పు భాగవతానికి పోలికలున్నప్పటికీ, ఈ శైలిలో నృత్యంతో పాటు గానం, తాళం, సాహిత్యాలు కూడా కళాకారులకు తెలిసి ఉండాలి. ఇక వేషం, అభినయం, గానంతో పాటు చక్కటి సంభాషణలు కూడా ఈ ప్రదర్శనలో భాగాలే. ఒకప్పుడు ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ కళ ఇప్పుడు అరుదైపోయిందని, అలాంటి కళారూపానికి చక్కటి వేదిక కల్పించినందుకు నాట్యసమగ్ర సంస్థకు, కళాకారులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రదర్శనను సంస్థ నిర్వాహకులు యశోద పర్యవేక్షించారు. ఈ ప్రదర్శనకు అభిరుచిగల హైదరాబాదీలతో పాటు విదేశీయులు కూడా హాజరయ్యారు.
- సాక్షి, సిటీప్లస్