అబ్బో... ఆమిర్! | That ... Aamir! | Sakshi
Sakshi News home page

అబ్బో... ఆమిర్!

Dec 27 2014 12:42 AM | Updated on Sep 2 2017 6:47 PM

అబ్బో... ఆమిర్!

అబ్బో... ఆమిర్!

తాజాగా రిలీజ్ అయిన ‘పీకే’ సినిమా హిట్‌తో హీరో ఆమిర్‌ఖాన్‌పై పొగడ్తలు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా రిలీజ్ అయిన ‘పీకే’ సినిమా హిట్‌తో హీరో ఆమిర్‌ఖాన్‌పై పొగడ్తలు వెల్లువెత్తుతున్నాయి. ఆమిర్ అదని... ఇదని... అసలేం చేసినా సూపరనీ తెగ మోసేస్తున్నారు బాలీవుడ్ జనాలు. రొమాంటిక్ భామ మల్లికా షెరావత్ అయితే ఓ అడుగు ముందుకేసింది. అసలు విషయం వదిలేసి... ఆమిర్ సొసైటీకి ఎంతో సేవ చేసేస్తున్నాడంటూ కితాబిచ్చేసింది. ‘ఐ లవ్ దట్ మూవీ. ఈ ఏడాదికి అద్భుతమైన ముగింపు ఇది. అంతే కాదు... సమాజ శ్రేయస్సులో ఆమిర్ భాగస్వామ్యం అమూల్యం. నిస్వార్థం’ అంటూ సినిమా క్యారెక్టర్‌ను నిజ జీవితానికి ముడిపెట్టేసింది. అందుకు తన ట్విట్టర్ పేజీని వేదికగా చేసుకుందీ చక్కని చుక్క!
 

Advertisement
 
Advertisement
Advertisement