పీర్ పోరాటం | Peer fight | Sakshi
Sakshi News home page

పీర్ పోరాటం

Feb 13 2015 12:08 AM | Updated on Oct 2 2018 2:44 PM

పీర్ పోరాటం - Sakshi

పీర్ పోరాటం

ప్రపంచ నాటక రచయితలలో ప్రముఖ పేరు ఇబ్సెన్. ఆయన రాసిన నాటకాల ప్రభావం భారతీయ నాటక, సినిమా రంగాలపై నేటికి కనిపిస్తుంది.

ప్రపంచ నాటక రచయితలలో ప్రముఖ పేరు ఇబ్సెన్. ఆయన రాసిన నాటకాల ప్రభావం భారతీయ నాటక, సినిమా రంగాలపై నేటికి కనిపిస్తుంది. మోడ్రన్ డ్రామా ఆద్యుడైన ఇబ్సెన్ నాటకం ‘పీర్‌గింట్’ని 5 భాషలు, 5 రీతుల్లో నగరంలో ప్రదర్శించనున్నారు. ‘ఇబ్సెన్ బిట్‌వీన్ ట్రెడిషన్ అండ్ కాంటెంపర్నిటీ’ పేరుతో ఈ ఫెస్టివల్‌ని రాయల్ నార్వేజియన్ ఎంబస్సీ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, హైదరాబాద్ యూనివర్సిటీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. తెలుగు ‘పీర్’ ప్లేతో ఈ ఫెస్టివల్ గురువారం ప్రారంభమైంది.
 
ఆధునిక నాటకాలకు ఆద్యుడు హెన్‌రిక్ ఇబ్సెన్. నార్వే జానపద కథను ఇబ్సెన్ ‘పీర్’ నాటకంగా మలిచారు. ఆ నాటకాన్ని క్లాసికల్, కాంటెంపరరీ, లోకల్, ఒరిజినల్... ఇలా రకరకాలుగా చూపించే ప్రయోగమే ఈ ఫెస్టివల్ థీమ్. పీర్‌గింట్ ప్లే ఇబ్సెన్ రాసిన ‘పీర్’కి అడాప్టేషన్. ఇబ్సెన్ రాసిన డైలాగులను అలాగే వుంచుతూ నేటి కాలమాన పరిస్థితుకు అనుగుణంగా నేటి తరానికి ఆయన నాటకాలను దగ్గర చేసేందుకు ప్రయత్నిస్తోంది టీటర్‌జోకర్ అనే నార్వే థియేటర్ కంపెనీ. ఈ ఒరిజినల్ నాటకాన్ని ప్రదర్శించడానికి 4 గంటలు పడుతుంది. 2012లో జరిగిన ‘ఇబ్సెన్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్’లో ప్రదర్శించడానికి నాటకాన్ని ఒక గంటకు కుదించి కొత్త తరహాలో రూపొందించారు. నాటి నుంచి నేటి వరకు నార్వేలో కొన్ని వందల సార్లు ఈ నాటకాన్ని ప్రదర్శించారు.
 
నాటకం క్లుప్తంగా...

తండ్రి దురలవాట్ల వలన ఆస్తి నష్టపోయిన కొడుకు పీర్. ఎలాగైనా పూర్వవైభవం పొందాలని ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో సాగే కథ మిగతా నాటకం. ఈ కథనంలో అతని ప్రేమ వ్యవహారాలు, ప్రయాణాలు ఆసక్తికరంగా వుంటాయి. అయితే ‘నార్వే కథను, ఆ భాషను, ఇక్కడి వారు ఎలా అర్థం చేసుకోగలరు’ అంటే, ఎక్స్‌ప్రెషన్‌ని మించిన భాష లేదనేదే వారి సమాధానం. ‘కథను ఏ మాత్రం మార్చకుండా రెగ్యులర్ లైఫ్‌లో కనిపించే ఫోన్, ఫ్లైట్, కాసినో, కారు లాంటి అనేక మోడరన్ లైఫ్ యుటిలిటీస్‌ని ఇందులో జొప్పించాం. లాంగ్వేజ్ పాతదే వుంచినా, ఈ వస్తువులు చూసి ఏం జరుగుతుందో అర్థం చేసుకోవటం సులభం. విదేశాల్లో ఈ నాటకాన్ని ప్రదర్శించటం ఇదే మొదటిసారి’ అని నాటక దర్శకులలో ఒకరైన యాంగ్వే మార్కుస్సేన్ తెలిపారు.
 
ఐదు రోజుల ఫెస్ట్...

ఈ ఫెస్టివల్‌లో పీర్ ప్లేను 5 భాషల్లో.. ఈ నెల 12 నుంచి 16 తేదీల్లో ప్రదర్శిస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 12న తెలుగులో చిందుభాగవతం, 14 మలయాళ కుడియాట్టం, 15న కన్నడ యక్షగానం, 16న తమిళంలో తెరుకుట్టు. రవీంద్రభారతిలో 13 సాయంత్రం 7 గంటలకు నార్వేయిన్ ప్లే.. ‘పీర్‌గింట్’.  
- ఓ మధు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement