మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఫెస్ట్ | Music and dance fest | Sakshi
Sakshi News home page

మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఫెస్ట్

Mar 23 2015 11:03 PM | Updated on Sep 2 2017 11:16 PM

మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఫెస్ట్

మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఫెస్ట్

సురాంజలి ఫౌండేషన్ పండిట్ భీమ్‌సేన్ జోషి పేరిట జాతీయ స్థాయి సంగీత, నృత్య కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

సురాంజలి ఫౌండేషన్ పండిట్ భీమ్‌సేన్ జోషి పేరిట జాతీయ స్థాయి సంగీత, నృత్య కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ నెల 27 నుంచి 29 వరకు గోల్కొండ కోట దగ్గర్లోని తారామతి బారాదరిలో ఈ సంగీత నృత్యోత్సవం జరుగనుంది. మూడు రోజులు జరిగే ఈ కార్యక్రమంలో వెంపటి శ్రీమయి నృత్య ప్రదర్శనతో పాటు, పండిట్ ఆనింద చటర్జీ, పండిట్ కుమార్ బోస్- తబలా, షౌనక్, ఆనంద్ భాటే- వోకల్, పండిట్ రాజన్, సాజన్ మిశ్రా శాస్త్రీయ గాత్ర కచేరీ, మహాపాత్రో ఒడిస్సీ నృత్యం, అభిజిత్ బెనర్జీ గ్రూప్ ప్రదర్శనలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు.

కార్యక్రమానికి చెందిన బ్రోచర్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ ఈవెంట్ నిర్వహణ ద్వారా వచ్చిన నిధులను ఆటిజం బాధిత చిన్నారులకు అందజేయనున్నట్టు తెలిపారు. మరిన్ని వివరాల కోసం 09989821333 ఫోన్ నంబర్‌ను సంప్రదించవచ్చు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement