లవ్లీ చాక్‌లెట్ | Lovely Chocolate | Sakshi
Sakshi News home page

లవ్లీ చాక్‌లెట్

Oct 20 2014 12:24 AM | Updated on Sep 2 2017 3:06 PM

లవ్లీ చాక్‌లెట్

లవ్లీ చాక్‌లెట్

లెట్ మీ గిఫ్ట్ యూ... చాక్‌లెట్. క్లిక్ చేయగానే ఒక బేస్.. మరోక్లిక్ చేస్తే దాని మీద క్రీమ్.

లెట్ మీ గిఫ్ట్ యూ... చాక్‌లెట్. క్లిక్ చేయగానే ఒక బేస్.. మరోక్లిక్ చేస్తే దాని మీద క్రీమ్. మూడో క్లిక్‌కి దాని మీద నచ్చిన టాపప్ వచ్చి పడుతుంది. అలా చక్కటి, మీ అనుబంధం అంత చిక్కటి చాక్లెట్ కేక్ నిమిషాల్లో తయారైపోతుంది. మీ ప్రియమైన వారి చేతుల్లోకి చేరిపోతుంది. ఎంత ఖరీదు పెట్టి మార్కెట్లో దొరికే చాక్లెట్లు కొని గిఫ్ట్‌గా ఇచ్చినా.. ఏదో చిన్న ఫీలింగ్. మనం అంత ఖర్చు పెట్టి ఇచ్చిన గిఫ్ట్ తనకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుందా.. లేదా.. అని డౌట్ కొడుతుంది. వీటన్నింటినీ అధిగమిస్తూ.. ల్యాప్‌టాప్‌లో గేమ్ ఆడుకున్నంత ఈజీగా ఆన్‌లైన్‌లో మీకు కావలసిన చాక్‌లెట్‌ని మీరే తయారు చేసుకోగలిగితే.. ఈ దీపావళికి మీకు కావల్సిన వాళ్లకు ఇవ్వడానికి తియ్యటి గిఫ్ట్ తయారైనట్టే! వావ్ అనిపిస్తుంది కదా.. అలా అనిపిస్తున్నాయ్.. సిటీలోని కొన్ని ఆన్‌లైన్  చాక్లెట్ స్టోర్స్.
 
డార్క్, వైట్, మిల్క్ చాక్‌లెట్ వీటిలో మీకు నచ్చిన బేస్ సెలెక్ట్ చేసుకొని, నట్స్, సీడ్స్, ఫ్రూట్స్, న్యూట్రిషియస్, క్యాండీస్ ఇలా రకరకాల టాపింగ్స్‌ని ఎంచుకోవచ్చు. దానిపై మీకు నచ్చిన వారి ఇమేజ్ సెట్ చేసి, చుట్టూ కావలసిన థీమ్, ఫ్లవర్స్, బర్త్‌డే, ఫెస్టివల్స్, అకేషన్స్‌కు అనుగుణంగా డెకరేట్ చేసుకోవచ్చు. మీ సందేశాన్ని మీరే రాసుకోవచ్చు. ఇష్టమైన వారికి ఇలాంటి చక్కని గిఫ్ట్‌తో సర్‌ప్రైజ్ చేయండి. 100, 1,000 గ్రాముల చాకోస్ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకోవచ్చు.            - ఓ మధు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement