గ్రహపాటు! | In addition to the asteroids | Sakshi
Sakshi News home page

గ్రహపాటు!

Apr 4 2015 11:41 PM | Updated on Sep 2 2017 11:51 PM

గ్రహపాటు!

గ్రహపాటు!

సామాజిక సైట్‌లో తన గారాల కుక్కగారి వీడియో ఒకటి పోస్ట్ చేయబోయి...

సామాజిక సైట్‌లో తన గారాల కుక్కగారి వీడియో ఒకటి పోస్ట్ చేయబోయి... పెద్ద చిక్కే కొని తెచ్చుకుంది సెక్సీ సింగర్ కాటి పెర్రీ. క్రిస్ జెన్నర్ పిక్సీ హెయిర్ స్టైల్‌లా తన అందమైన లూజ్ హెయిర్‌ను కట్ చేసుకుని షాకిచ్చిన క్యూటీ... మరోసారి ఫ్యాన్స్‌ను షేక్ చేసింది. సోషల్ సైట్ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో పెట్ డాగ్ బటర్స్ చిలిపి చేష్టల వీడియోను మురిపెంగా అప్‌లోడ్ చేసిన అమ్మడికి కాసేపట్లోనే షాక్ మీద షాక్‌లు తగిలాయి.

సదరు కుక్కగారి మెళ్లో వేలాడ దీసిన ట్యాగ్‌పై పెర్రీ ఫోన్ నంబర్ కూడా ఉందట!!! దీన్ని పసిగట్టిన ఫ్యాన్స్... కాల్స్ మీద కాల్స్ చేసేశారట. దెబ్బకు కంగుతిన్న స్వీటీ... కాసేపటికి తేరుకుని, జరిగింది అర్థం చేసుకుందట. పొరపాటు గ్రహపాటుగా మారిన ఈ ఎపిసోడ్‌లో మిలియన్ల కాల్స్ చిన్నదాని ఫోన్‌కు చేరాయట. ఈ బాధ తట్టుకోలేక వెంటనే ఆ వీడియో తొలగించేసి... ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేస్తే గానీ విశ్రాంతి దొరకలేదనేది ఓ యూఎస్ మ్యాగజైన్ కథనం!!!  
 

Advertisement
 
Advertisement
Advertisement