breaking news
Social site
-
గ్రహపాటు!
సామాజిక సైట్లో తన గారాల కుక్కగారి వీడియో ఒకటి పోస్ట్ చేయబోయి... పెద్ద చిక్కే కొని తెచ్చుకుంది సెక్సీ సింగర్ కాటి పెర్రీ. క్రిస్ జెన్నర్ పిక్సీ హెయిర్ స్టైల్లా తన అందమైన లూజ్ హెయిర్‌ను కట్ చేసుకుని షాకిచ్చిన క్యూటీ... మరోసారి ఫ్యాన్స్‌ను షేక్ చేసింది. సోషల్ సైట్ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో పెట్ డాగ్ బటర్స్ చిలిపి చేష్టల వీడియోను మురిపెంగా అప్లోడ్ చేసిన అమ్మడికి కాసేపట్లోనే షాక్ మీద షాక్‌లు తగిలాయి. సదరు కుక్కగారి మెళ్లో వేలాడ దీసిన ట్యాగ్‌పై పెర్రీ ఫోన్ నంబర్ కూడా ఉందట!!! దీన్ని పసిగట్టిన ఫ్యాన్స్... కాల్స్ మీద కాల్స్ చేసేశారట. దెబ్బకు కంగుతిన్న స్వీటీ... కాసేపటికి తేరుకుని, జరిగింది అర్థం చేసుకుందట. పొరపాటు గ్రహపాటుగా మారిన ఈ ఎపిసోడ్లో మిలియన్ల కాల్స్ చిన్నదాని ఫోన్‌కు చేరాయట. ఈ బాధ తట్టుకోలేక వెంటనే ఆ వీడియో తొలగించేసి... ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేస్తే గానీ విశ్రాంతి దొరకలేదనేది ఓ యూఎస్ మ్యాగజైన్ కథనం!!! -
సన్నీ సిజిలింగ్స్!
అడల్ట్ స్టార్ సన్నీ లియోన్ వెండి తెరపైనే కాదు... సోషల్ సైట్ల్లోనూ ఉష్ణోగ్రతలు పెంచేస్తోంది. బీచ్‌లో బికినీలపై దిగిన ఫొటోలను పోస్ట్ చేసి పురుషపుంగవులకు నిద్దర లేని రాత్రులను మిగులుస్తోంది. బ్లాక్ బికినీలో ఒకటి... వైట్ ట్రాన్స్ఫరెంట్లో మరొకటి... ఒకదాని వెంట ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేసి టెంపరేచర్ బిల్డప్ చేసేసింది. ‘బ్యాంకాక్‌లోని ఓ ప్రైవేట్ బీచ్‌లో పూల్‌సైడ్ ఆస్వాదనం ఇది’ అంటూ ఓ కామెంటూ యాడ్ చేసిందీ సెక్సీ తార. ఏదిఏమైనా ‘సన్’సైడ్ పిక్చర్స్ ఇలా షేర్ చేసిన సన్నీ ‘బోల్డ్’నెస్ చూసి కుర్రాళ్లంతా ఖుషీ అవుతున్నారు.