ఇన్ఫెక్షన్లతో గుండెకు ముప్పు

Heart Attack Threat Up 40% After An Infection - Sakshi

లండన్‌ : ఛాతీ ఇన్ఫెక్షన్లు, న్యుమోనియా సహా ఇతర ఇన్ఫెక్షన్లతో బాధపడే రోగులకు తర్వాతి సంవత్సరాల్లో గుండెపోటు ముప్పు అధికమని ఓ అథ్యయనంలో వెల్లడైంది. సాధారణ ఇన్ఫెక్షన్లకు గురయ్యే వారికి గుండె పోటు, స్ట్రోక్‌ ముప్పును నివారించేందుకు స్టాటిన్‌లు, హార్ట్‌ పిల్స్‌ ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. న్యుమోనియా, మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్లతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరిన 12 లక్షల మందిని పరిశీలించగా, వారిలో ఎనిమిదేళ్లలో గుండె పోటు వచ్చే ముప్పు 40 శాతం మందికి ఉందని పరిశోధనలో వెల్లడైంది. వారిలో 150 మంది స్ర్టోక్‌కు గురయ్యే రిస్క్‌ పొంచిఉందని తేలింది.

గుండె ఆరోగ్యంపై ఇన్ఫెక్షన్ల ప్రభావం ఒబెసిటీ కంటే అధికంగా ఉంటుందని బర్మింగ్‌హామ్‌లోని ఆస్టన్‌ మెడికల్‌ స్కూల్‌, యూనివర్సిటీ ఆఫ్‌ కేం‍బ్రిడ్జి పరిశోధక బృందం వెల్లడించింది. ఇన్ఫెక్షన్‌తో బాధపడిన వారికి హైబీపీ, కొలెస్ర్టాల్‌, డయాబెటిస్‌ వ్యాధులకు ఇచ్చిన చికిత్స మాదిరి ట్రీట్‌మెంట్‌ అందించాలని సూచించింది. వారి గుండెకు ఎలాంటి ముప్పు లేకుండా నివారణ కోసం స్టాటిన్స్‌, ఆస్పిరిన్‌లు ఇవ్వాలని వైద్యులకు తెలిపింది. 

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top