హెల్దీ & టేస్టీ | healthy & tasty | Sakshi
Sakshi News home page

హెల్దీ & టేస్టీ

Mar 12 2015 12:33 AM | Updated on Sep 2 2017 10:40 PM

హెల్దీ & టేస్టీ

హెల్దీ & టేస్టీ

రోజుకోరకం రుచిని ఇష్టపడే ఫుడ్ లవర్స్‌కోసం పూటకో రెసిపీని అందిస్తున్నారు నగరంలోని చెఫ్స్. రుచితోపాటు ఆరోగ్యాన్ని జోడించిన డిషెస్ వండి వడ్డిస్తున్నారు.

రోజుకోరకం రుచిని ఇష్టపడే ఫుడ్ లవర్స్‌కోసం పూటకో రెసిపీని అందిస్తున్నారు నగరంలోని చెఫ్స్. రుచితోపాటు ఆరోగ్యాన్ని జోడించిన డిషెస్ వండి వడ్డిస్తున్నారు. తెలుగువారు ఇష్టపడే సీఫుడ్, మటన్‌లతో వెరైటీ ప్రయోగాలు చేస్తున్నారు బంజారాహిల్స్‌లోని ‘టేక్‌అవే’ చెఫ్ నర్సింహులు. ఆ హెల్దీ డిషెస్ మీకోసం...
 
ఆవకాయ చేపలకూర
ఆవకాయ అంటే ఇష్టపడని తెలుగువారుండరు. అయితే పచ్చడికి బదులు కాస్త వెరైటీని కోరుకునేవారి కోసమే ఈ ఆవకాయ చేపకూర. పేస్టు చేసి వారం రోజులు నిల్వ ఉంచిన ఆ మిశ్రమం ఊరి ఇంకా టేస్ట్ అనిపిస్తుంది. ఆ పేస్ట్‌ను చేపలకూరతో కలిపి మారినేట్ చేస్తే... కాస్త పుల్లగా, కొంచెం కారంగా, మరికాస్త తీయగా... మొత్తానికి డిఫరెంట్ టేస్ట్‌తో నోరూరిస్తుంది. నార్త్ ఇండియన్స్ సైతం ఇష్టపడటం దీని స్పెషాలిటీ!
 
అల్లం-రొయ్యల వేపుడు
పరిగడుపున అల్లం తింటే పైత్యం వదులుతుందంటారు పెద్దలు. కానీ ఈ రోజుల్లో అంత ఇష్టంగా అల్లం తినేవాళ్లెవరు. అందుకే... అల్లం, మిరియాలపొడి, బాదాం పేస్టు వంటి పోషకాలు కలిగిన ప్రోడక్ట్స్‌ను రొయ్యలకు కలిపి, ఎలాంటి ఫుడ్ కలర్స్ ఉపయోగించకుండా చేసే ఒక మంచి స్టార్టర్ అల్లం-రొయ్యల వేపుడు. ఇది నాన్స్‌లో, ఈవెనింగ్ స్నాక్స్‌తోపాటు పప్పు చారు అన్నంలో మంచింగ్‌కి మంచి కాంబినేషన్.
 
పొనగంటి మాంసపు వేపుడు
సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు దొరికే పొనగంటి కూరలో ఎన్నో పోషకాలున్నాయి. ఈ పొనగంటి ఆకులను మాంసంతో కలిసి చేసే ఈ స్టీమ్‌డ్ మటన్‌ఫ్రై టేస్ట్‌లో డిఫరెంట్. ఎలాంటి బటర్, చీజ్, అజినమోటోలు, కెమికల్స్ ఉపయోగించకుండా కేవలం రెండు చెంచాల ఆయిల్‌తో చేసే ఈ డిష్ పిల్లలకూ మంచిది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement