వేలానికి జేమ్స్బాండ్ డిబి5 కారు | Goldfinger gold DB5 car for auction | Sakshi
Sakshi News home page

వేలానికి జేమ్స్బాండ్ కారు

Sep 29 2014 10:22 AM | Updated on Sep 2 2017 2:07 PM

ఆస్టిన్‌ మార్టిన్‌  డిబి5 కారు

ఆస్టిన్‌ మార్టిన్‌ డిబి5 కారు

1964లో గోల్డ్‌ ఫింగర్ సినిమాలో సీన్ కానరీ వాడిన ఆస్టిన్‌ మార్టిన్‌కు చెందిన డిబి5 కారుకు మంచి పేరు వచ్చింది.

జేమ్స్‌ బాండ్‌007. ఈ సినిమాలు  తెలియని వారుండరు.  ప్రపంచ వ్యాప్తంగా తెలిసిన పేరు. ప్రపంచ సినిమా చరిత్రలో ఇంతటి పేరు సినిమాలోని  మరో ఏ హీరో పాత్రకు రాలేదు. ఇప్పటి వరకు జేమ్స్బాండ్ వాడిన కార్లు 23 మోడల్స్ ఉన్నాయి. ఈ చిత్రాలలో  హీరో జేమ్స్‌ బాండ్‌ వాడే కార్లకు ప్రత్యేకత ఉంటుంది. 1964లో గోల్డ్‌ ఫింగర్ సినిమాలో సీన్ కానరీ వాడిన ఆస్టిన్‌ మార్టిన్‌కు చెందిన డిబి5 కారుకు హీరోతో పాటు మంచి పేరు వచ్చింది.  జేమ్స్ బాండ్ సినిమాల్లో మంచి గుర్తింపు వచ్చిన కారు ఇదే. ఈ చిత్రం విడుదలై  50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా  ఆ  ప్రొడక్షన్‌ సంస్ధ ఈ కారును వేలం వేస్తోంది

 24 క్యారెట్ల గోల్డ్‌ కోటింగ్ ఉన్న ఈ  కారు అప్పట్లోనే టెక్నాలజీలో బుల్లేట్‌ ఫ్రూప్‌ షీల్డ్‌, హెవీ మిషన్‌ గన్స్‌ , ర్యామ్స్‌ లైట్స్‌తోపాటు వెనుక బంపర్‌... అన్ని మోడిఫై చేసుకునే విధంగా దీన్ని డిజైన్‌ చేశారు. స్టీరింగ్, గేర్‌బాక్స్‌ దగ్గర నుంచి మిర్రర్స్‌ వరకు అన్ని ప్రత్యేకతలు ఈ కారులో ఉన్నాయి.

 దీని ద్వారా వచ్చే ఫండ్‌ను పసిపిల్లలపై జరిగే అఘాయిత్యాలను నిరోధించేందుకు వినియోగించనున్నట్లు  ఈ కారును రూపొందించిన ఇఒఎన్‌ ప్రొడక్షన్‌ తెలిపింది. ఆన్‌లైన్‌ ద్వారా జరిగే ఈ ఆక్షన్‌ ద్వారా  5 కోట్ల రూపాయల వరకు సేకరించాలని  ప్రొడక్షన్‌ హౌస్‌ అంచనా వేస్తోంది. ఇదే సినిమాలో వాడిన ఆక్వాటెర్రా - రిస్ట్‌ వాచీని కూడా ఈ వేలంలో ఉంచుతున్నట్లు నిర్వాహక సంస్ధ తెలిపింది. దాదాపుగా 11 జేమ్స్‌ బాండ్‌ సినిమాల్లో ఇదే మోడల్‌  ఆస్టిన్‌ మార్టిన్‌ కారును  ఉపయోగించారు. చివరగా జేమ్స్‌ బాండ్‌ నటించిన చివరి సినిమా స్కైఫాల్‌లో సైతం ఆస్టిన్‌ మార్టిన్‌ కారునే వాడారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement