స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో రాజకీయాలా? | chandra babu politicises his independence day speech | Sakshi
Sakshi News home page

స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో రాజకీయాలా?

Aug 15 2014 12:12 PM | Updated on Sep 17 2018 5:10 PM

స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో రాజకీయాలా? - Sakshi

స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో రాజకీయాలా?

స్వాతంత్ర్య దినోత్సవం ప్రసంగంలో నరేంద్రమోడీ రాజకీయాలను పక్కన పెడితే.. చంద్రబాబు మాత్రం వాటినే పట్టుకుని వేలాడారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని నాయకులు చేసే ప్రసంగాల మీద అందరి దృష్టీ ఉంటుంది. ఏం చెబుతారోనని ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. కొంతమంది ఈ సందర్భాన్ని అభివృద్ధి, పురోగతి లాంటి విషయాలకు ఉపయోగించుకుంటే మరికొందరు మాత్రం రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నారు. ఈ విషయం శుక్రవారం నాటి వేడుకల ప్రసంగాల్లో స్పష్టంగా తేలిపోయింది. తనకు రాజకీయాలు వద్దని, ఇంతకుముందు పనిచేసిన ప్రభుత్వాలకు, ప్రధానమంత్రులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని ప్రధానమంత్రి నరేంద్రమోడీ చెప్పారు. వాళ్లందరి కృషివల్లే దేశం ఇంత ముందుకు వచ్చిందని, దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని అన్నారు.

మరోవైపు కర్నూలులో స్వాతంత్ర్య దినోత్సవంలో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం పక్కా రాజకీయ వాదిలాగే మాట్లాడారు. అత్యధిక కాలం పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ తెలుగువాళ్లను నిర్లక్ష్యం చేసిందని, రాష్ట్రాన్ని అత్యంత బాధ్యతారహితంగా విభజించిందని, అందుకే ఆ పార్టీకి గట్టిగా బుద్ధిచెప్పి మొత్తం ఓడించారని అన్నారు. తొమ్మిదేళ్లు హైదరాబాద్లో స్వాతంత్ర్య దినోత్సవాల్లో పాల్గొన్న తనకు.. ఇప్పుడు కర్నూలులో ఈ వేడుకలు చేసుకోవాల్సి రావడం బాధాకరంగా ఉందన్నారు. ఒకరకంగా చెప్పాలంటే గతంలో ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా ఉన్న కర్నూలు నగరాన్ని ఆయన ఈ విధంగా అవమానించారు. జాతీయ పండుగల వేళ రాజకీయాలకు దూరంగా ఉండాలన్న కనీస విషయాన్ని కూడా మరిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement