స్త్రీవాద దేశంగా వేల్స్‌ | Wales is a feminist country | Sakshi
Sakshi News home page

స్త్రీవాద దేశంగా వేల్స్‌

Jun 5 2018 12:07 AM | Updated on Jun 5 2018 12:07 AM

Wales is a feminist country - Sakshi

వేల్స్‌ ఫస్ట్‌ మినిస్టర్‌ కార్వి జోన్స్‌

వేల్స్‌ ప్రభుత్వాన్ని ‘ఫెమినిస్టు ప్రభుత్వం’గా మార్చేందుకు ఏం చేయాలన్న విషయమై ఆ దేశంలో ఇప్పుడు ఒక కమిటీ ఆధ్యర్యంలో దీర్ఘాలోచన సాగుతోంది! గ్రేట్‌ బ్రిటన్‌ పరిధిలోని ఒక దేశం వేల్స్‌. ఆ దేశ ఫస్ట్‌ మినిస్టర్‌ కార్విన్‌ జోన్స్‌ (అక్కడ ప్రధానిని ‘ఫస్ట్‌ మినిస్టర్‌’ అంటారు) బి.బి.సి. రేడియో 4 లోని ‘ఉమెన్స్‌ అవర్‌’ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘లైంగిక సమానత్వాన్ని సాధించేందుకు ‘ఫెమినిజం’ అనే భావనను పురుషులు అర్థం చేసుకోవడం ఎంతైనా అవసరం’ అని కూడా అన్నారు. బ్రిటన్‌ యువరాణి మేఘన్‌ మార్కెల్‌ తన అధికారిక జీవిత చరిత్రలో వ్యక్తం చేసిన అభిప్రాయాలకు ఈ సందర్భంగా ఆయన మద్దతు తెలిపారు.

‘నేను స్త్రీనైనందుకు, స్త్రీవాదినైనందుకు గర్విస్తున్నాను అని స్త్రీ అనగానే (మేఘన్‌ ఇలాగే అన్నారు) ఆమెను మనం ఒక సాధారణ స్త్రీగా కాకుండా, ఆమెనొక దుడుకుమోతుగా చూస్తాం. దీనిని బట్టి స్త్రీ,పురుష సమానత్వం కోసం మనమింకా ఎంతో దూరం ప్రయాణించవలసి ఉందని తెలుస్తోంది’ అన్నారు కార్విన్‌ జోన్స్‌. పదేళ్లుగా అధికారంలో ఉన్న జోన్స్‌ ఈ ఏడాది డిసెంబరులో పదవి నుంచి దిగిపోతున్నారు. ఆలోపే వేల్స్‌ను ‘స్త్రీవాద దేశం’గా మలుస్తానని తన ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ముందైతే ఒక విధాన నిర్ణయాన్ని రూపొందించే పనిలో పడ్డారు. ఆయన తర్వాత వచ్చేవారు ఆ విధానాలను పాటిస్తారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement