మనశ్శాంతి ఉండడం లేదా?

Useful information by panyala jagannath das  - Sakshi

సంపద, హోదా వంటివి ఎన్ని ఉన్నా, ఇంట్లో పరిస్థితులు ప్రశాంతంగా లేకపోతే ఏమాత్రం మనశ్శాంతి ఉండదు. దంపతుల మధ్య తరచు తగవులు, మనస్పర్థలు తలెత్తుతున్నట్లయితే, ఎంత సంపద ఉన్నా, జీవితంలో సంతృప్తి కొరవడుతుంది. ఇలాంటి పరిస్థితిని అధిగమించాలంటే..
ప్రతిరోజూ ఉదయం గోవులకు, శునకాలకు గోధుమలతో తయారు చేసిన రొట్టెలను ఆహారంగా పెట్టండి. పక్షులకు ఆహారంగా జొన్న గింజలు వేయండి
సాయంత్రం వేళ పడక గదిలో కర్పూరం వెలిగించండి. పడక గదికి తెలుపు, లేత నీలం, లేత గులాబి రంగులు మాత్రమే ఉపయోగించండి. పడక గది గోడలకు ఎట్టి పరిస్థితుల్లోనూ పసుపు, పసుపు కలగలసిన రంగులను ఉపయోగించకండి.
ఆలయాలు సందర్శించేటప్పుడు ఎవరైనా వృద్ధ దంపతులు కనిపిస్తే, పాదాభివందనం చేసి వారి ఆశీస్సులు పొందండి.
దుస్తులు, పరిమళ ద్రవ్యాలు, అలంకరణ వస్తువులు వంటివి కొనాలనుకుంటే, వీలైనంత వరకు వాటిని శుక్రవారం రోజున కొనండి.
ఏదైనా శుక్రవారం రోజున శివాలయాన్ని దర్శించి, ఆలయ పూజారికి కిలోన్నర బొబ్బర్లు, కిలోన్నర పంచదార, తెల్లని పంచె దానం చేయండి.

– పన్యాల జగన్నాథదాసు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top