రుణబాధలు పీడిస్తున్నాయా? | Panyala Jagannath Das about debt suffer | Sakshi
Sakshi News home page

రుణబాధలు పీడిస్తున్నాయా?

Aug 20 2017 12:03 AM | Updated on Sep 12 2017 12:30 AM

నిత్యం కొందరికి ఆదాయానికీ వ్యయానికీ పొంతన ఉండదు. ఏదో ఒక ఇబ్బంది ముంచుకొస్తూ అప్పుల ఊబిలోకి నెట్టేసే పరిస్థితులు ఎదువుతూ ఉంటాయి.

నిత్యం కొందరికి ఆదాయానికీ వ్యయానికీ పొంతన ఉండదు. ఏదో ఒక ఇబ్బంది ముంచుకొస్తూ అప్పుల ఊబిలోకి నెట్టేసే పరిస్థితులు ఎదువుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యను అధిగమించాలంటే...
► ప్రతిరోజూ అంగారక స్తోత్రాన్ని పఠించాలి. మంగళవారం రోజున పురోహితులకు ఏడు కిలోల కందులు, ఒకటిన్నర కిలోల బెల్లం, ఎర్రని వస్త్రాలు తగిన దక్షిణతో కలిపి దానంగా ఇవ్వాలి
► సోమవారం ప్రదోష సమయంలో శివాలయానికి వెళ్లి, శివలింగానికి వరిపిండితో అభిషేకం చేయించాలి. లేదా ఇంట్లోనే పూజామందిరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి వరిపిండితో అభిషేకం చేసుకోవచ్చు. ఈ పరిహారాన్ని కనీసం పదకొండు వారాలు పాటించాల్సి ఉంటుంది
►శ్రీ లక్ష్మీనృసింహ రుణ విమోచన స్తోత్రాన్ని అనుదినం పఠిం చాలి.  వీలుంటే నారసింహ క్షేత్రాన్ని దర్శించుకుని, స్వామివారికి చందనం. పూలు, పాలు, తేనె, పానకం సమర్పించాలి
► శుక్రవారం రోజున ఆకలితో ఉన్నవారు తారసపడితే వారికి తృప్తిగా భోజనం పెట్టండి. కనీసం ఐదు ఆదివారాలు ఆవుకు బెల్లం కలిపి చేసిన రొట్టెలు స్వయంగా తినిపించండి
►ఇంట్లో నగదు, విలువైన వస్తువులను భద్రపరచే బీరువా, క్యాష్‌బాక్స్‌ వంటి వాటిలో చిన్న సైజులో ఉండే చింతచెట్టు కొమ్మను కూడా ఉంచండి. బీరువా, క్యాష్‌బాక్స్‌లలో ఏడు డేగ ఈకలను ఉంచినా ఫలితం ఉంటుంది.
– పన్యాల జగన్నాథ దాసు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement