ట్రెక్కింగ్‌కి ఈ వస్తువులు తప్పనిసరి...

ట్రెక్కింగ్‌కి ఈ వస్తువులు తప్పనిసరి...


వర్షాకాలం

 

 టూల్ టార్చ్:

వర్షాకాలం ప్రయాణాలు పెట్టుకున్నవారికి ముఖ్యంగా ట్రెక్కర్స్‌కి టూల్ టార్చ్ చాలా అవసరం. టార్చ్‌లైట్, కత్తి, పట్టకార, ప్లైర్, కంపాస్ రోల్డ్... ఇవన్నీ ఒకే దాంట్లో కలిపి ఉంటే వెంట తీసుకెళ్లడం చాలా సులువు. హిట్‌ప్లే.ఇన్‌లో ఇది రూ.1,499కే లభిస్తుంది.

 

దోమల నివారణ బ్యాండ్ప్రయాణంలో ఎక్కడికెళ్లినా రాత్రిపూట దోమల బెడద తప్పదు. ఆరుబయట ఉన్నప్పుడు ఈ సమస్య మరీ ఎక్కువ. అందులోనూ దోమలు ఎక్కువగా పిల్లలను టార్గెట్ చేస్తుంటాయి. దోమల నివారణ బ్యాండ్ (మస్కిటో రిపెల్లింగ్ బ్యాండ్) పిల్లల చేతికి తొడిగితే మీ ఆందోళన తీరుతుంది. ఇవి పిల్లలను ఆకట్టుకునే లిజార్డ్, కప్ప, బ్యాట్, సాలీడు.. వంటి రకరకాల మోడల్స్‌లో లభిస్తున్నాయి. రెండు బ్యాండ్స్ రూ.399కి లభిస్తున్నాయి. ఇవి నగరాలలోని పిల్లల వస్తువుల షాపుల్లోనూ, మెడికల్ స్టోర్‌లలోనూ లభిస్తాయి.

 

పాదాలకు రక్ష...
కాస్త రఫ్‌గా, ఇంకాస్త లైట్ వెయిట్‌గా, పాదాలకు సౌకర్యంగా, ఫ్యాన్సీ కలర్‌లలో లభించే షూని మగువ లు చాలా ఇష్టపడతారు. ట్రెక్కింగ్‌లో ఇలాంటి షూ కోసం వెదికేవారికి ఉడ్‌లాండ్ షాపులలో రూ.3,591 లకు లభిస్తున్నాయి. వీటిని స్నీకర్స్ అని అడిగి తీసుకోవాలి. బురదలోనూ, రాళ్లలోనూ పాదాలకు సౌకర్యంగా ఉండే ఈ షూలు మగవారికి సుఖంగా ఉంటాయి. వానాకాలపు ట్రెక్కింగ్‌లో రఫ్ అండ్ టఫ్ అనిపించే ఈ షూ ధర రూ.12,990. టింబర్‌లాండ్ ఔట్‌లెట్‌లలో లభిస్తున్నాయి.

 

డ్రై బ్యాగ్... ప్రయాణానికి వెళ్లేటప్పుడు శుభ్రంగా సర్దుకున్న బ్యాగ్, మధ్యలోనే చిందరవందరగా మారిపోతుంది. విడిచిన దుస్తులు, వేసుకోవాల్సినవి అన్నీ ఒకే చోట పెడితే కొత్త ఇబ్బందులు తలెత్తుతాయి. అలాంటి సమస్య లేకుండా ఈ డ్రై బ్యాగ్ ఉపయోగపడుతుంది. ఈ బ్యాగ్ 30 కేజీల బరువును ఆపగలుగుతుంది. పైగా వాటర్‌ప్రూఫ్ కూడా. హిట్‌ప్లే.ఇన్ లో లభించే ఈ బ్యాగ్‌ధర రూ.1,249.

 

ఫోన్ సురక్షితం.. పర్వతారోహణలో ఫోన్‌లో జీపీఎస్ సిస్టమ్ ఆన్‌లో ఉంటే ఎంతో ఉపయుక్తం. కానీ, జిపిఎస్ సిస్టమ్ డెరైక్షన్స్‌ను ఫోన్‌లో అనుసరించడం వల్ల వర్షం పడుతున్నప్పుడు చూడటం కష్టం అవుతుంది. వర్షపునీటికి ఫోన్ పాడవుతుందనే భయం కూడా ఉంటుంది. ఈ సమస్య తలెత్తకుండా ఉండటానికి ఈ వెదర్ ప్రూఫ్ ఫోన్ కేస్ సహాయపడుతుంది. హిట్‌ప్లే.ఇన్‌లో దీని ధర రూ.4,199.

 

విశ్రాంతికి టెంట్...  సాహస యాత్రికులకు ఈ టెంట్ ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. నీటిని, గాలిని తట్టుకునే సామర్థ్యం గల ఈ టెంట్ దారి మధ్యలో మీరెక్కడైనా రెస్ట్ తీసుకోవడానికి ఎంతో ఉపయోగకరం. ఈ టెంట్‌కి స్లీపింగ్ బ్యాగ్స్, బ్యాక్‌ప్యాక్స్ కూడా ఉన్నాయి. నైలాన్ ఫ్లోర్ ఉండటం వల్ల తడి నేలలోనూ అనువుగా ఉంటుంది. ఉడ్‌లాండ్ షాపులలో దీని ధర రూ.10 వేలు.

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top