సాటిలేని వైద్యం.. ఆయుర్వేద భాగ్యం

today national ayurvedic day - Sakshi

నేడు జాతీయ ఆయుర్వేద దినోత్సవం

ప్రకృతి మనిషిని సృష్టిస్తే... మనిషి రోగాలను సృష్టించుకున్నాడు. ఇప్పుడిప్పుడే తప్పు తెలుసుకుంటూ ప్రకృతి శరణు వేడుకుంటున్నాడు. అదే క్రమంలో తిరిగి తెరపైకి వచ్చింది...ప్రపంచానికి భారతదేశం అందించిన అద్భుతం... ఆయుర్వేదం. వైద్య విధానాలు వెల్లువెత్తుతున్న ఆధునిక కాలంలో... ఈ సనాతన భారతీయ సంప్రదాయ ఆరోగ్య ప్రదాయిని... నగరవాసుల పాలిట సహజ ప్రత్యామ్నాయంగా మారి ఆయుర్వేద ఉత్పత్తులు, వైద్యవిధానాలు, ఆసుపత్రుల బాట పట్టేలా చేస్తోంది. 

సాక్షి, సిటీబ్యూరో:సూర్యోదయానికి ముందు నిద్రలేవాలి. సూర్యాస్తమయంలోగా భుజించడం పూర్తి కావాలి. పరిమితంగా తినాలి. శారీరకశ్రమ తప్పనిసరిగా ఉండాలి. ఇది ఆయుర్వేదం చెప్పే జీవన విధానం. ఆధునిక హైదరాబాద్‌కు అనారోగ్య భాగ్యం ప్రాప్తిస్తున్న పరిస్థితుల్లో చక్కని జీవనవిధానాన్ని సూచించే ఆయుర్వేదాన్ని అనుసరించడం అవసరం ఎంతైనా ఉందంటారు. ఈ తరహా జీవనశైలిని అనుసరిస్తే వీటిలో అత్యధిక శాతం జబ్బులు అసలు రాకుండానే నివారించవచ్చు. నైట్‌లైఫ్‌ బాగా పెరగడం వల్ల, నిద్రలేమి, విపరీతమైన ఒత్తిడి, తద్వారా హోర్మోన్ల అసమతౌల్యం వంటివి రోగాలకు కారణమవుతున్నాయని, దీనిని వెంటనే సరిచేసుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుత ఆధునిక వైద్యాల ద్వారా రోగాల నుంచి తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారం లేనందున, ఆయుర్వేదంపై నగరవాసుల్లో అవగాహన పెరగాల్సి ఉందన్నారు.  

పుస్తకాలు.. ఆరోగ్య నేస్తాలు
ఆత్మ, ఇంద్రియాలు, మనసు.. ఈ మూడూ ప్రసన్నంగా ఉండడమే ఆరోగ్యం. మనుషులను 7 రకాలుగా విభజించి ఎలాంటివారు ఏం చేయాలి? ఏ సీజన్‌లో ఎలాంటివి తిని ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో శాస్త్రం సూచించింది. ఇవన్నీ ఆయుర్వేద గ్రంధాల్లో వివరంగా ఉందంటున్నారు శాస్త్ర నిపుణులు. వీటిని చదవడం ప్రతి ఒక్కరికీ అవసరమంటున్నారు.  

వైద్య విధానం ఇదీ..
అస్తవ్యస్త జీవనశైలి కారణంగా అంతర్గత, బాహ్య శరీరంలో పేరుకుపోయే టాక్సిన్స్, ప్రీ రాడికల్స్‌తో శరీరంలోని మెటబాలిజం డిస్ట్రబ్‌ అయిపోతుంది. వీటిని తొలుత పంచకర్మలు ద్వారా బయటకు పంపిస్తారు. తర్వాత ఇమ్యూనో మాడ్యులేటరీ డ్రగ్స్‌ అంటే అశ్వగంధ, యష్టి మధు, అమృత, షడ్గుణ సింధూరం.. వంటివి వినియోగించి దేహాన్ని శుద్ధి చేస్తారు. కొన్ని రకాల జీవనశైలులను, ఆహార వ్యవహారాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.  

మన రక్షణ వ్యవస్థే శత్రువుగా..
నగరవాసులను వేధిస్తున్న ఆరోగ్యసమస్యల్లో ప్రధానమైనవి డిప్రెషన్, అలర్జీ, అస్తమా వంటి శ్వాసకోస వ్యాధులు, డయాబెటిస్, రక్తపోటు, ఒబెసిటీ..  ముందు వరుసలో ఉన్నాయి. ఇప్పుడు ‘ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్స్‌’ పేరిట కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. మన రోగ నిరోధక శక్తి మనమీదే దాడి చేయడమే ఈ డిజార్డర్స్‌. ఉన్నట్లుండి చెవులు వినపడకపోవడం, కళ్లు కనపడకపోవడం ఇలాం టివే. అలాగే కొన్ని రకాల ఆర్థ్రరైటిస్, సొరియాసిస్‌.. ఇలా దాదాపు 100 రకాల జబ్బులకు ఇది కారణమవుతోంది. దీనికి అస్తవ్యస్తంగా మారిన జీవన విధానమే ప్రధాన కారణం. వీటిని ఎదుర్కునేందుకు వినియోగిస్తున్న స్టెరా యిడ్స్‌  పూర్తిగా రోగ నిరోధక శక్తిని ధ్వంసం చేసి,  ఇతర దుష్పలితాలకు దారి తీస్తాయి. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top