కణకణంలోనూ కిల్లర్‌ కోడ్‌!

There any system to cope with cancer-like threats? - Sakshi

నార్త్‌వెస్టర్న్‌ మెడిసిన్‌ శాస్త్రవేత్తలు ఓ ఆసక్తికరమైన ఆవిష్కరణ చేశారు. మన శరీరంలోని ప్రతి కణంలో ఉండే రహస్యమైన కోడ్‌ను వీరు గుర్తించారు. కణం అదుపు తప్పి పోతుందనుకున్నప్పుడు తనను తాను చంపేసుకునేందుకు ఈ కోడ్‌ ఉపకరిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ కోడ్, దాని వెనుకనున్న వ్యవస్థను క్షుణ్ణంగా అర్థం చేసుకోగలిగితే భవిష్యత్తులో కేన్సర్‌ అనేది అస్సలు ఉండదని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త మార్కస్‌ పీటర్‌ అంటున్నారు. రోగనిరోధక వ్యవస్థ ఏర్పడకముందు బహుకణ జీవుల్లో కేన్సర్‌ లాంటి ముప్పులను తట్టుకునేందుకు ఏదైనా వ్యవస్థ ఉందా? తెలుసుకునేందుకు మార్కస్‌ పరిశోధనలు చేపట్టారు.

అతిసూక్ష్మమైన ఆర్‌ఎన్‌ఏ కణాలను చైతన్యవంతం చేయడం ద్వారా ముప్పులను అడ్డుకునేందుకు అతిపురాతన కాలం నుంచి ఓ వ్యవస్థ పనిచేస్తున్నట్లు గత ఏడాది స్పష్టమైంది. కీమోథెరపీ కూడా ఇదేరకంగా పనిచేస్తూండటం ఇక్కడ గమనార్హం. ఆరు న్యూక్లియోటైడ్లతో కూడిన మూలకాలు కేన్సర్‌ కణాలను నాశనం చేస్తున్నట్టు గుర్తించిన శాస్త్రవేత్తలు మొత్తం 4096 మూలకాలలో కచ్చితంగా ఏది ఈ పనిచేస్తోందో తెలుసుకోగలిగారు. ఈ మూలకం ఆధారంగా మందులు తయారు చేస్తే నిరోధకత అన్నది ఉండదని, కీమోథెరపీ అవసరం లేకుండా కేన్సర్‌ కణాలను నాశనం చేయవచ్చునని పీటర్‌ తెలిపారు.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top