ఆ నేడు ఆగస్ట్ 31, 1997 | That today, August 31, 1997 | Sakshi
Sakshi News home page

ఆ నేడు ఆగస్ట్ 31, 1997

Aug 30 2015 11:49 PM | Updated on Aug 14 2018 3:22 PM

ఆ  నేడు ఆగస్ట్ 31, 1997 - Sakshi

ఆ నేడు ఆగస్ట్ 31, 1997

బ్రిటన్ రాకుమారి డయానా కారు ప్రమాదంలో దుర్మరణం చెందారు.

పాపరాట్సీ పొట్టన పెట్టుకుంది!

 బ్రిటన్ రాకుమారి డయానా కారు ప్రమాదంలో దుర్మరణం చెందారు. పారిస్‌లోని ఒక సొరంగ మార్గంలో ఆమె కారు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెంటాడుతున్న ‘పాపరాట్సీ’ లను (ప్రముఖ వ్యక్తుల ఫొటోలను వారి అనుమతి లేకుండా తీసే ప్రయత్నం చేసేవారు) తప్పించుకునేందుకు కారు డ్రైవర్ అతివేగంగా నడపడంతో కారు గోడకు డీకొని ఈ దుర్ఘటన జరిగింది.

భర్త ప్రిన్స్ చార్లెస్, ఇద్దరు కుమారులు విలియమ్, హారీ... స్కాట్‌లాండ్‌లో వేసవి సెలవల్ని గడుపుతుండగా, డయానా ఫ్రాన్స్‌లో ఉండడంపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కారు ప్రమాదంలో మరణించినవారిలో సంపన్న వ్యాపారి కుమారుడు డోడీ అల్ ఫయేద్ కూడా ఉండడంతో మీడియా ఊహాలకు అంతేలేకుండా పోయింది. ఇరవైయ్యవ శతాబ్దపు అందగత్తెల్లో ఒకరిగా డయానా గుర్తింపు పొందారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement