ఆ నేడు 10 సెప్టెంబర్, 1981 | That today, 10 September, 1981 | Sakshi
Sakshi News home page

ఆ నేడు 10 సెప్టెంబర్, 1981

Sep 10 2015 12:08 AM | Updated on Mar 22 2019 1:41 PM

ఆ  నేడు  10 సెప్టెంబర్, 1981 - Sakshi

ఆ నేడు 10 సెప్టెంబర్, 1981

పికాసో గీసిన ‘గుయెర్నికా’ కేవలం పెయింటింగ్ అనడానికి మనసు రాదు.

కళా శక్తి
 
పికాసో గీసిన ‘గుయెర్నికా’ కేవలం పెయింటింగ్ అనడానికి మనసు రాదు. కళ అనేది విడిగా ఏకాంత దీవిలో ఉండదని, సమాజంతో పాటు నడుస్తుందని, సామాజిక చలనాలకు స్పందిస్తుందని నిరూపించిన చారిత్రక చిత్రరాజం... గుయెర్నికా. బూడిద, నలుపు, తెలుపు రంగుల్లోని ‘గుయెర్నికా’ యుద్ధవ్యతిరేక పెయింటింగ్‌గా చరిత్రలో నిలిచిపోయింది.
 
స్పెయిన్‌లోని గుయెర్నికా పట్టణంపై 1937లో జర్మన్, ఇటలీ యుద్ధ విమానాలు జరిపిన  బాంబు దాడికి నిరసనగా పికాసో గీసిన చిత్రం ఇది. ప్రపంచ యాత్ర చేసిన ‘గుయెర్నికా’  ఎంతో మందిని ఉత్తేజితులను చేసింది. యుద్ధ విధ్వంసాన్ని  శక్తిమంతంగా ప్రతిబింబించింది.
 సుదీర్ఘకాలం ప్రవాసంలో ఉన్న ‘గుయెర్నికా’ 10 సెప్టెంబర్, 1981లో స్పెయిన్‌కు చేరుకుంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement