సులభశైలిలో సుందరకాండ | sundara kanda in easy language | Sakshi
Sakshi News home page

సులభశైలిలో సుందరకాండ

Oct 9 2013 12:33 AM | Updated on Sep 1 2017 11:27 PM

సుందరకాండ అనే పేరు వినగానే రకరకాల శ్లోకాలు, పారాయణ సమయంలో పాటించవలసిన నియమ నిష్ఠలు గుర్తుకు రావడం సహజం.

 సుందరకాండ అనే పేరు వినగానే రకరకాల శ్లోకాలు, పారాయణ సమయంలో పాటించవలసిన నియమ నిష్ఠలు గుర్తుకు రావడం సహజం. అయితే ఆచార్య మసన చెన్నప్ప మాత్రం చక్కటి తేటతెలుగులో సుందరకాండను అందించారు. క్లిష్టమైన సంస్కృత పద ప్రయోగాలు చేస్తూ, భాషాపాండిత్యం ప్రదర్శించకుండా అందరికీ అర్థమయ్యేలా సులభశైఇలో రాసిన ఈ సుందరకాండను చదవడం మొదలు పెడితే చాలు... హాయిగా సాగిపోతుంది. రచయిత తరగతులలో బోధించే ఆచార్యులు కావడం మూలాన ఎవరికి ఎలా చెబితే బోధపడుతుందన్న అవగాహనతో అన్ని తరగతుల పాఠకులనూ దృష్టిలో పెట్టుకుని ఈ రచన చేశారనిపిస్తుంది. ఏ అధ్యాయంలో ఏముందో తెలుసుకునే వీలు కలిగించే విషయసూచి లేదన్న కొద్దిపాటి లోటు మినహా సుందరకాండలో ఏముందో తెలుసుకోవాలనుకునేవారికి, పారాయణ సమయంలో నియమ నిష్ఠలు పాటించలేమేమో అన్న శంకతో ఇంతకాలం దూరం పెట్టిన వారికి ఈ పుస్తకం కలకండ పలుకులాంటిది.
 సుందరకాండ; పుటలు: 81; వెల రూ. 75
 ప్రతులకు: ప్రమీలా ప్రచురణలు; 9-76/2, ఉదయనగర్ కాలనీ,
 బోడుప్పల్, హైదరాబాద్ - 500 092
 - డి.వి.ఆర్.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement